శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (15:29 IST)

పిల్లలు సన్నగా ఉన్నారా? బరువు పెరగాలంటే?

పిల్లలు సన్నగా ఉన్నారా..? ఏమాత్రం బరువు పెరగట్లేదా.. అయితే ఈ సలహాలు పాటించండి. పూర్తి కొవ్వు కలిగిన పాలనే పిల్లలకు ఇవ్వాలి. పాల నుంచి వెన్న తొలగించకండి. పెరిగే పిల్లలకి అదనపు కొవ్వు ఎంతో మంచిది. 
 
ఆహారాన్ని పిల్లలకు నచ్చే విధంగా తయారు చేయడం వల్ల భోజన సమయంలో  పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఎదురవదు. ప్లేట్‌లో వడ్డించినదంతా తినాలని వారిని బలవంత పెట్టవద్దు. పిల్లలకు తగినన్ని పోషకాలు, కేలరీస్ ఆహారం ద్వారా చేరుతున్నాయో లేదో తప్పకుండ గమనించాలి. 
 
ఖీర్ లేదా క్యారట్ హల్వా‌ను ఫుల్ ఫాట్ క్రీమ్‌తో కలిపి హెల్తీ డిజర్ట్ తయారుచేయండి. పిల్లలు ఎదిగే కొద్ది స్నాక్స్‌ను ఇవ్వచ్చు. ఇడ్లీ, దోసలతో పల్లీ లేదా కొబ్బరి చట్నీలను జత చేయవచ్చు. అయినప్పటికీ పిల్లలకు నట్స్ ను కూడా ఇవ్వాలి. నట్స్ ను పొడి చేసి లేదా చిన్నగా తరిగి పిల్లలకు తరచూ ఇవ్వాలి.
 
పిల్లలకు పెట్టే పప్పు, కూరగాయలలో కొద్దిగా నెయ్యి, వెన్న లేదా ఆలివ్ ఆయిల్‌ను కలిపి తినిపించండి. అలాగే పిజ్జా, పాస్తా, శాండ్ విచ్ లలో కొద్దిగా ఛీజ్‌ను కలపండి. సూప్స్, జామ్ శాండ్ విచ్, మ్యాష్ చేసిన పొటాటోలకు కాస్త క్రీమ్‌ను జోడించండి. పిల్లల డైట్‌లో నట్స్‌కు చోటివ్వండి. ఆల్మండ్, జీడిపప్పులను పిల్లల భోజనానికి జత చేయండని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
పొటాటోలను అలాగే మరికొన్ని స్టార్చీ వెజిటబుల్స్ ను పిల్లల ఆహారంలో కలపండి. నాన్ వెజిటేరియన్ అయితే గుడ్లు, చికెన్ లను పిల్లలకు అలవాటు చేయండి. పిల్లలకి నచ్చే విధంగా ఆహారాన్ని వెరైటీగా అందించండి. ఒకే ఆహారాన్ని రోజూ పెట్టకండి. పిల్లలకు ఇలా చేస్తే విసుగు కలుగవచ్చు.. తద్వారా తినడం మానేయడం.. బరువు తగ్గిపోతారని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.