శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2015 (16:58 IST)

పిల్లలకు ఏ సైజ్ ప్లేటులో అన్నం పెడుతున్నారా?

అన్నం వడ్డించే ప్లేటులపై పిల్లలు ఆహారం తీసుకోవడం ఆధారపడివుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లల్లో ఆకలిని నియంత్రించడంలో పళ్లెం పాత్ర కూడా కీలకం అని తాజా అధ్యయనంలో తేలింది. నిర్దిష్ట పరిమాణంలో తిండి తీసుకోవాలనే అవగాహన పిల్లల్లో ఉండదు. అలవాటు కూడా ఉండదు. అందుకే వారి భోజనం అలవాటు ఎప్పటికప్పుడు మారుతుంది. 
 
చిన్నపిల్లలు ఎంత తింటున్నారనేది వారి పళ్లెం సైజును బట్టి ఉంటుందని ఓ తాజా అధ్యయనంలో గుర్తించారు. పిల్లలకు సరిపోయేలా ఉండే పళ్లెంలో వడ్డించినప్పుడు వారు మితంగానే తిన్నారు. 
 
అదే పెద్ద పళ్లేల్లో వడ్డించినప్పుడు.. ఎక్కువ వడ్డించుకోవడం మాత్రమే కాకుండా.. ఎక్కువ కేలరీలు తీసుకున్నారట. మాంసాహారం తీసుకునే సమయంలో ఇలా పళ్లేన్ని బట్టి ఎక్కువ వడ్డించుకోవడం బాగా పెరుగుతుందట. అందుకే పిల్లల్లో ఆకలిని నియంత్రించడంలో పళ్లెం పాత్ర కూడా కీలకం అని పరిశోధకులు అంటున్నారు.