శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:22 IST)

పిల్లలతో ఏర్పడే ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే..?

సాధారణంగా పిల్లలు పుట్టి, కాస్త పెద్దవాళ్లయ్యాక చాలామంది తల్లులు తమ అభిరుచులూ, ఆసక్తులను వదిలేస్తుంటారు. మీరూ అలాంటి మూసలో పడిపోవద్దు. ఎన్ని పనులున్నా మీకు ఇష్టమైన వాటికి కొంత సమయం కేటాయించుకునేలా చూసుకోండి.

ఓ పుస్తకం చదువుకోవడం, ఏదైనా రాసుకోవడం, వ్యాయామం చేయడం.. ఇలా మీకు ఏది ఇష్టమో, ఏదీ ముఖ్యమో దానిపై దృష్టి పెట్టండి. మీ జీవితంలో భాగం చేసుకోండి. దానికి తగినట్లుగా మీ దినచర్యను రూపొందించుకోండి. 
 
పనులతో విపరీతంగా అలసిపోయారు. కనీసం అరగంట నుంచి గంటవరకు విశ్రాంతి తీసుకోవాలి. పిల్లల్ని కాసేపు ఆడుకోమని చెప్పి విశ్రాంతి తీసుకోండి. స్నేహితురాళ్లను కలిసి చాలా రోజులైందా.. ఓ సాయంత్రం పిల్లల్ని మీ భాగస్వామికి అప్పగించి వాళ్లింటికి వెళ్లి రండి. కాసేపు ఉపశమనంగా అనిపిస్తుంది. 
 
పిల్లల్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. అల్లరి చేస్తారు. ఇల్లంతా బొమ్మలు పారేస్తారు. రకరకాల కోరికలు కోరతారు. అలాంటి సమయాల్లో సహజంగా సహనం తగ్గుతుంది. అలాగని కోపం తెచ్చుకోకండి. కాసేపు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం, కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం చేయండి. వాళ్ల పనులు వాళ్లు చేసుకునేలా, వేళకు చదువుకునేలా అలవాటు చేయండి. దీనివల్ల వాళ్లకు బాధ్యత తెలుస్తుంది. మీకూ కొంత ఒత్తిడి తగ్గుతుంది.