శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By preeti
Last Modified: మంగళవారం, 20 జూన్ 2017 (18:38 IST)

పిల్లలూ... మంచివారూ... మంచివారుగా నటించేవారూ ఎలా వుంటారో తెలుసా?

నిజాయితీ గల మనుషులు ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. అదే నకిలీ మనుషులు అధికారం ఉన్నవారికి మాత్రమే విలువనిస్తారు. మంచి వ్యక్తులు తాము చేసే మంచి పనులు ఇతరులు గుర్తించాలని ఏనాడూ భావించరు, కానీ మంచిగా నటించే వ్యక్తులు మాత్రం ఇతరుల దృష్టిని తమ వైపుకు తిప్పుకోవ

నిజాయితీ గల మనుషులు ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. అదే నకిలీ మనుషులు అధికారం ఉన్నవారికి మాత్రమే విలువనిస్తారు. మంచి వ్యక్తులు తాము చేసే మంచి పనులు ఇతరులు గుర్తించాలని ఏనాడూ భావించరు, కానీ మంచిగా నటించే వ్యక్తులు మాత్రం ఇతరుల దృష్టిని తమ వైపుకు తిప్పుకోవడానికి తాపత్రయపడుతుంటారు. 
 
మంచి వ్యక్తులు ఎప్పుడూ గొప్పలకుపోరు, అదే మరోరకం వ్యక్తులైతే అవకాశం దొరికినప్పుడు లేదా అవకాశం దొరకబుచ్చుకునీ మరీ తమ గొప్పలు చెప్పుకుంటుంటారు. మంచివారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు, అదే అలా నటించే వ్యక్తులు మాత్రం సులభంగా మాటిస్తారు, కానీ చాలా తక్కువసార్లు వాటిపై నిలబడతారు. ఈ లక్షణాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరు మంచివారో ఎవరు మంచివారిగా నటిస్తున్నారో సులభంగా తెలుసుకోవచ్చు.