శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (17:50 IST)

పిల్లలు చెప్పిన మాట వినాలంటే పారెంట్స్ ఏం చేయాలి?

పిల్లలకి కాస్త సమయం దొరికితే చాలు.. ఇల్లు పీకి పందిరేస్తారు. చెప్పిన మాట పట్టాన వినరు. అలాగని అన్నిసార్లూ కోప్పడి ఒకేచోట కూర్చోబెట్టడం సాధ్యం కాదు. అందుకే చెబితే మాట వినేలా తీర్చి దిద్దాలంటే.. పారెంట్స్ ఇలా చేయాలి.. 
 
* "వాడు ఎం చెప్పినా వినడు, నచ్చిందే తప్ప, వేరే పనేదీ చేయడు'' అంటూ పదే  పదే తల్లిదండ్రులు పిల్లల ముందే వారిలోని ప్రతికూల లక్షణాలను పదే పదే చెబుతుంటారు. వారు నిజంగానే అలా ప్రవర్తిస్తున్నా, ఇలా చెబుతుండటం వల్ల అమ్మ తేలిగ్గా తీసుకుంది. ఫరవాలేదులే అన్న ధీమాకు వచ్చేస్తారు. అలా కాకుండా మా అమ్మాయి లేదా అబ్బాయి చెప్పిన మాట వింటారు. త్వరగా అర్థం చేసుకుని పని పూర్తి చేస్తుంది. అని చెబుతూ ఉంటే కచ్చితంగా వారిలో సానుకూల మార్పు ఉంటుంది. 
 
* పిల్లలు స్కూలు నుంచి ఇంటికొచ్చాక కాసేపు హోం వర్క్ చేసుకోవడం, లేదంటే టీవీ చూడటం వంటి వాటితోనే సమయం గడిచిపోతోందా? ఇలా కాకుండా వారికి నచ్చిన విధంగా కథల పుస్తకాలు, డ్రాయింగ్, పాటలు వినడం వంటివి చేయిస్తే వారిలో మార్పులు వస్తాయి. 
 
* పిల్లల్ని వంటగదిలోకి రానివ్వండి. చిన్న చిన్న పనులు అలవాటు చేయండి. కూరగాయల్ని శుభ్రంగా కడిగి ఇవ్వమనడం, డైనింగ్ టేబుల్ తుడవడం వంటివి అలవాటు చేస్తే సరిపోతుంది. వారు సరిగ్గా చేయకపోయినా విసుగు ప్రదర్శించకుండా వారికి నచ్చజెప్పే విధంలో కొంత మార్పు చేసుకోండి.. అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు.