శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 నవంబరు 2014 (17:56 IST)

పిల్లల పట్ల ఓర్పుగా ఉండండి.. లేకుంటే డేంజరే!

తల్లిదండ్రులు పిల్లల పట్ల ఓర్పుగా ఉండాలంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. ఓర్పు, ఓపిక లేకుండా తల్లిదండ్రులే కోపంతో ఊగిపోతే.. పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
 
తల్లిదండ్రులు కొన్ని సందర్భాలలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయాలలో ఓర్పుగా ప్రశాంతంగా ఉండండి. సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నించండి. పిల్లలకు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో ప్రశాంతంగా వివరించండి. 
 
తల్లిదండ్రులు తమ అభిరుచులను పిల్లలపై రుద్దకూడదు. డబ్బుల విషయంలో మరీ నిక్కచ్చిగా ఉండకండి. ప్రతీ రోజు డబ్బుల్ని పిల్లలకి ఇవ్వడం మంచిది కాకపోయినా వారు అడిగే ప్రతీ చిన్న విషయానికి డబ్బులు ఇవ్వకపోవడం మంచిది కాదని గమనించండి. 
 
డబ్బులు అడిగిన ప్రతీ సారి పొదుపు, జాగ్రత్తలు వంటివి చెబితే వారి దృష్టిలో తల్లిదండ్రులు కఠినమైన వారుగా మిగిలిపోచారు. అవసరానికి తగ్గట్టు వారికి డబ్బులు ఇవ్వాలి. వాటిని  పొదుపు చేసే విధానాన్ని కూడా అర్థమయ్యేటట్లు చెప్పాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.