శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By ESWAR
Last Updated : మంగళవారం, 1 జులై 2014 (13:30 IST)

‘‘ మీకు అమ్మానాన్నలు ఎలా ఉంటే ఇష్టం’’?... మీ పిల్లలు ఏం చెప్తారంటే...

పూర్వం పిల్లలకు, పెద్దలతో ఎలా వ్యవహరించాలో నేర్పేవారు. కానీ ఇపుడు కాలం మారింది.. పెద్దలకు పిల్లలతో ఎలా వ్యవహరించాలో నేర్పే పాఠాలు వచ్చాయి. ఈ పాఠాలను పెద్దలందరూ  నేర్చుకోవడం తప్పనిసరైంది. నాన్సెన్స్ మాకు పాఠాలేంటి అని పెద్దలు అంటున్నారు. నా ఇష్టం వచ్చినట్టు నా పిల్లల్తో వ్యవహరిస్తాను. మా నాన్న అలాగే ఉండేవాడు.. సో నేను కూడా మా నాన్నలాగే వ్యవహరిస్తాను అంటే కుదరుదు. అలా అనుకుంటే మీరు సమస్యల్లో పడక మానరు. 
 
పూర్వం రోజుల్లో పిల్లల క్రమశిక్షణ వేరు. అప్పటి కాలమాన పరిస్థితులు వేరు. కానీ నేటి పిల్లల పద్ధతే వేరు. టీవీలు, సినిమాలతో పాటు క్లాస్‌మేట్స్ ప్రభావం కూడా చాలానే ఉంటుంది.
 
పిల్లలకు పోషక పదార్ధాలు ఎంత శక్తినిస్తాయో, తల్లిదండ్రుల ప్రేమానురాగాలు అంతకన్నా రెట్టింపు శక్తినిస్తాయి. పిల్లల్లో విశ్వాసాన్ని పెంచుతాయి. ప్రేమాభిమానాలంటే మంచి ఆహారం, మంచి బట్టలు, ఖరీదైన బొమ్మలు కొనివ్వడం, మంచి బడికి పంపడం అంతకన్నా కాదు, వీటికి అతీతంగా ఉండే బలమైన శక్తే తల్లిదండ్రుల ప్రేమ.
 
‘‘ మీకు అమ్మానాన్నలు ఎలా ఉంటే ఇష్టం’’ ? అని కొంతమంది చిన్నారులను అడిగితే వారి నుంచి వచ్చిన సమాధానాలు ఇవి.. 
( ) నేను స్కూల్ నుంచి రాగానే, అమ్మానాన్నా నన్ను ముద్దు పెట్టుకోవడానికి పోటీ పడాలి
( ) దొంగల్ని పోలీసులు వెంటాడినట్లుగా ‘‘చదువు చదువు’’ అని పదే పదే చెప్పకూడదు
( ) అమ్మ కొత్తకొత్త కథలు చెప్పాలి, కథ చెప్పమన్నప్పుడు విసుక్కోకూడదు
( ) ఎదురింటి పక్కింటి పిల్లలతో పోల్చకూడదు. అలా పోలిస్తే అప్పుడు ఆ పిల్లలతో మాట్లాడాలనిపించదు
( ) గ్రాండ్ పేరెంట్స్‌ను తరుచూ కలవాలి
( ) వారానికొకసారి అమ్మనాన్నలతో బయట తిరగాలి
( ) అమ్మా నాన్న ఎప్పుడూ పోట్లాడుకోకూడదు
( ) మా ఫ్రెండ్స్ ఇంటికొచ్చినప్పడు నవ్వుతూ మాట్లాడాలి
( )మేము చెప్పే విషయాలు విసుక్కోకుండా నవ్వుతూ వినాలి. నిజానికి ఈ విషయాలు ఏమీ పెద్ద క్లిష్టమైనవి కాదు, అసంజనమైనవి కావు, ప్రతి పేరెంట్ చేయగలిగేవే. కానీ ఇవి చేయాలంటే పెద్దలు కాస్త మైండ్ సెట్ మార్చుకోవాలంతే. అంటున్నారు సుప్రసిధ్ద మానసిక విశ్లేషకులు, మోటివేటర్ బి.వి పట్టాభిరామ్. మెజీషియన్, హిప్నాటిస్ట్, రచయిత అయిన ఎస్.గమనం  రాసిన ‘మంచి తల్లిదండ్రులు కావడం ఎలా ?’అనే పుస్తకానికి  బి.వి పట్టాభిరామ్ రాసిన ముందుమాటలోని మాటలివి.