శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (18:22 IST)

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?

వేసవికాలంలో కానీ మరెప్పుడైనా కూడా పిల్లలకు నీటి బాటిళ్లు ఇచ్చి పంపుతుంటాం. అది కూడా ప్లాస్టిక్ బాటిళ్లు. ప్లాస్టిక్ బాటిళ్లలోనున్న నీరు స్వచ్ఛతగా ఉన్నాయా లేదా అనే విషయం చూసుకోవాలంటున్నారు వైద్యులు. వారికి కొని ఇచ్చే బాటిళ్ల నాణ్యతను చూడాలంటున్నారు నిపుణులు.  
 
ప్రముఖంగా పాల్‌థీన్ టెరీఫ్తలెట్‌తో తయారు చేసిన బాటిళ్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదని రోచెస్టర్ స్కూల్ ఆఫ్ మెడిసన్, జియోత్ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 
 
నాణ్యత లేని ప్లాస్టిక్‌ని ఉపయోగించడం వలన వాటిలోని రసాయనాలు నీటిలో కలిసి ప్రత్యుత్పత్తి కారక హార్మోన్లపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పిల్లలకు వాటర్ బాటిళ్ కొని ఇచ్చేటప్పుడు వాటి నాణ్యతను దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు.