శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 3 సెప్టెంబరు 2014 (17:21 IST)

పీనట్ బటర్‌ : పిల్లల్లో ఎనర్జీని పెంచుతుందట!

పీనట్ బటర్‌లో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. సాధారణంగా పీనట్ బటర్‌ని చూడగానే పక్కన బెట్టేస్తుంటారు. చాలామంది తల్లిదండ్రులు పీనట్ బటర్ తినడం వల్ల శరీరానికి అనారోగ్యంతో పాటు, అధిక బరువు కారణం అవుతుందని పిల్లలకు కూడా పెట్టకుండా దూరంగా ఉంచుతారు.
 
కానీ పిల్లలకు ఈ క్రీమీ పీనట్ బటర్ రుచి అంటే చాలా ఇష్టం. ఇందులోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పిల్లలకు ఎంతో మేలు చేకూరుస్తాయి. పీనట్ బటర్‌లో ప్రోటీనులు మరియు కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటాయని. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
స్కూల్‌కు వెళ్ళే పిల్లలకు అధిక శక్తి చాలా అవసరం. అందుకే పీనట్ బటర్ పిల్లలకు అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది. అందువల్ల, ఈ క్రీమ్ బటర్‌ను ఉదయం ఇచ్చే ఆహారంలో జోడించి ఇవ్వడం వల్ల రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉంటారు.
 
ఇక ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లలప్పుడే కంటిచూపులో లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న వయస్సు నుండే పిల్లలు అద్దాలు ఉపయోగిస్తుంటారు. కంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే అధిక ప్రోటీనులున్న పీనట్ బటర్ పిల్లలకు అందివ్వడం వల్ల కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చును.