బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (16:07 IST)

మీకు కరెంటు తీగపై ఎప్పుడైనా పావురము కనిపించిందా?

పావురము కరెంటు తీగలపై కానీ, చెట్లమీద కానీ ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? అలాగే చెట్టు మీద వాలడం చూసారా? దీని వెనుక ఏమైనా కారణం ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 
 
సాధారణంగా పక్షులు చెట్లపై నివసిస్తాయని మనకు తెలుసు. అలాగే గూళ్లు కట్టుకుని ఉండడం చూస్తూనే ఉన్నాం. అలాగే కాకి, కొంగ, పిచ్చుక వంటి ఎన్నో పక్షులు కరెంటు తీగలపై, వైర్ల మీద వాలడం చూసే ఉంటారు. అయితే పావురాన్ని మీరు అలాగ ఎప్పుడైనా చూసారా? పావురము మామూలు పక్షుల మాదిరి కరెంటు తీగలపై గానీ, చెట్లపై గానీ వాలదు. ఎప్పుడూ కూడా ఇది గోడల మీద లేదా బిల్డింగ్‌ల మీద మాత్రమే వాలుతుంది. అందుకు కారణం వాటి కాళ్ల నిర్మాణమేనట.
 
మిగతా పక్షులకు కొమ్మలను, తీగలను పట్టుకునేందుకు వీలుగా కాళ్లుకు ఉన్న వేళ్లు వంగుతాయి. ఆ పట్టు వల్లనే పక్షులు ఎంత గాలి వీచినా కింద పడిపోకుండా ఉంటాయి. కాగా ఇదే కాళ్ల నిర్మాణము పావురానికి లేదు. నేల మీద, ఎత్తు పల్లాలు లేదా రాళ్ల మీద నడిచేటటువంటి పాదాల నిర్మాణం పావురానికి లేదు. కనుకనే పావురము ఎప్పుడూ చెట్టు కొమ్మలు, అలాగే కరెంటు తీగలపై వాలదు.