బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (14:56 IST)

వాడిపోయిన పువ్వులు దేవునికి సమర్పిస్తే....

ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే మనం ఎల్లప్పుడు సుఖసంతోషంగా ఉండోచ్చని పెద్దలు అంటుంటారు. అలాగే కొన్ని వస్తువులు పెట్టుకుంటే అది అశుభమని కూడా అంటారు. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది మూడనమ్మకం అనుకుం

ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే మనం ఎల్లప్పుడు సుఖసంతోషంగా ఉండవచ్చని పెద్దలు అంటుంటారు. అలాగే కొన్ని వస్తువులు పెట్టుకుంటే అది అశుభమని కూడా అంటారు. అయితే ఇలాంటి విషయాలను చాలామంది మూడనమ్మకం అనుకుంటున్నారు. సుఖసంతోషాల నిలయమైన ఇంట్లో కొన్ని వస్తువుల వలన ధనం కోల్పోవడం కూడా జరుగుతుందని జ్యోతిష్యులు చెపుతున్నారు. మన సంపద, ధనంపై దుష్ప్రభావం చూపే వస్తువులేంటి, ఏ వస్తువుల వలన మనకు శుభం కలుగుతుందో చూద్దాం.
 
కొంతమంది ఇంట్లో పాపురం గూడును పెట్టుకుంటారు. ఈ గూడు వలన ఇంట్లో ధనం తగ్గిపోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. పగిలిన వస్తువులు ఇంటికి అశుభం. దరిద్రాన్ని చేతులారా ఆహ్వానిస్తాయి. కాబట్టి పగిలిపోయిన అద్ధం ఇంట్లో ఉంటే వెంటనే పారేస్తే మంచిది. గబ్బిలాలు అనారోగ్యానికి, దురదృష్టకర పరిస్థితులకు, పేదరికం, మరణానికి సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు. 
 
గబ్బిలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నివసిస్తే సూర్యాస్తమయం తరువాత తలుపులు, కిటికీలు మూసేసుకుంటే మంచిది. ప్రతిరోజూ దేవునికి పూజించేటప్పుడు విరబూసిన పువ్వులనే సమర్పించాలి. నిత్యం దేవుడి గదిని శుభ్రం చేసి వాడిపోయిన పువ్వులను తీసివేయ్యాలి. వాడిపోయిన పువ్వులు దేవునికి సమర్పిస్తే దరిద్రాన్ని ఆహ్వానించినట్టే అవుతుందని జ్యోతిష్యులు తెలిపారు.