ఉచిత ప్రయాణం
కాలి నడక నడిచే వాళ్ళ నుండి
కార్లలో తిరిగే వారి వరకు
పసి బిడ్డ నుండి
పండు ముసలి వరకు
హైహీల్స్ వాడే వారి నుండి
కాళ్ళకు చెప్పులే లేని వారి వరకు
నడచి వెళ్ళే దూరమైనా
నడవ ననుకునే వారి వరకు
లేదు స్త్రీలకు బస్సుల్లో టిక్కెట్టు
తగిలించుకుంటారు చెవులకు పెట్టుకుంటారు ఇయర్ ఫోన్లు..
వింటూ వుంటారు తమకేమీ పట్టనట్టు
ఉచిత టిక్కెట్టైనా తీసుకోరు అడిగి
స్త్రీల సీట్లు ఖాళీగా వున్నా
కూర్చుంటారు అన్ని చోట్లా
నిలబడి వున్నది ముసలాడైనా
పట్టించుకోరు యువతులైనా
చేరవలసిన స్ధలానికి మారుతూ వెళుతారు
రెండు మూడు బస్సుల్లోనైనా
అతివల ఆగడాలు ఆకాశానంటుతున్నాయి
తిప్పలు పడుతున్నాడు బస్సు కండక్టర్
ప్రయాణికుల వాదోపవాదాలకు జవాబులు చెప్పలేక.
రచన :- గుడిమెట్ల చెన్నయ్య, చెన్నై