బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (11:55 IST)

పిన్న వయస్కుడవు... ఇక్కడికి రాకు...

lovers
పిన్న వయస్కుడవు
చదువుకుంటున్న వాడిలా వున్నావు
తెలియక వచ్చావు భ్రమలో పడి
నేనేమీ అందగత్తెను కాను నీ వనుకుంటున్నట్లుగా
ఇది పైన పటారం లోన లొటారం
కావివి అమృతములూరే అధరాలు
కావివి కాంతివంతమైన కనులు
విటుల చేతి మర్దనతో పటుత్వం తప్పినవీ పాలిండ్లు
ప్రతి మగాడి చూపుడు వ్రేలి తాకిడికి కందినదీ నాభి
కోల్పోయినది స్పర్శ నీవు స్వర్గమనుకుంటున్న ఈ మర్మస్థానం
దరికి రాబోకు
ఇది మలిన దేహం
వయస్సు మళ్ళిన దేహం
పాడు చెసుకోకు ఇందులోపడి నీ జీవితాన్ని
పెంచుకో బాగా చదివి నీ జ్ఞానాన్ని
అందుకో ఎన్నో ఉన్నత పదవులను
చూడగలుగుతావు ఎందరో సుందరాంగులను
ఎంచుకో అందులో నీకు నచ్చిన దానిని
చేసుకో నీ జీవితాన్ని సుఖమయం
చేయకు ఇకపై ఇటు వచ్చే ప్రయత్నం 


రచయిత ... గుడిమెట్ల చెన్నయ్య, చెన్నై.