శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:09 IST)

ఈవీఎంలను మోసుకెళ్లిన గాడిదలు..!

భారతదేశం ఎంతో ప్రగతి సాధించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్డు మార్గాలు సరిగా లేవు. ఫలితంగా అలాంటి ప్రాంతాల్లో రవాణాకు ప్రాచీన పద్ధతినే అవలంభిస్తున్నారు. అదే గాడిదలను వాహనాలుగా ఉపయోగిస్తున్నారు. త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురి జిల్లాలోని పెన్న‌గార‌ం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌ుగుతున్న ఎన్నిక‌ల కోసం ఎన్నిక‌ల సంఘం అధికారులు గాడిద‌ల‌ను వాడారు. 
 
కొట్టూరుమలై గ్రామానికి ఈవీఎంల‌ను మోసుకువెళ్లేందుకు నాలుగు గాడిద‌ల‌ను ఈసీ అధికారులు కిరాయి తీసుకున్నారు. హైవేకి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి రోడ్డు లేదు. ఆ ఊరికి వెళ్లడానికి వాహనాలు లేవు. అయితే ఈవీఎంల‌ను మోసుకెళ్లేందుకు గాడిద‌ల‌ను వాడాల్సి వ‌చ్చింది. ఆ ఊరిలో సుమారు 341 ఓట‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఈవీఎంల‌ను మోసుకెళ్లిన గాడిద‌ల‌కు సినిమా హీరోల పేర్లు పెట్టారు. వీటిని ర‌జ‌నీ, క‌మ‌ల్‌, అజిత్‌, విజ‌య్ అనే పేర్లతో పిలుస్తుంటారు. చిన్న‌స్వామి అనే వ్య‌క్తికి చెందిన గాడిద‌లు ఈవీఎంను మోసుకువెళ్లాయి. 1970 నుంచి ఆ గ్రామానికి గాడిద‌ల ద్వారానే ఎన్నిక‌ల సామాగ్రిని మోసుకువెళ్తున్న‌ట్లు అత‌ను చెప్పాడు. అయితే రోజూ ఒక గాడిద‌కు 2 వేలు రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తారు.