గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 ప్రముఖ నియోజకవర్గం
Written By మోహన్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (18:20 IST)

రాజకీయ నాయకులారా.. దయచేసి మా ఊరికి మాత్రం రావద్దు..!

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈసారి ఎన్నికల్లో పాల్గొనదలచుకోలేదని చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని గుర్రప్పనాయుడుకండ్రిగ గ్రామస్తులు సోమవారం గోడలకు పోస్టర్లు అంటించారు.


ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం కోసం తమ గ్రామానికి రావద్దని సూచించారు. గ్రామంలో ప్రధాన రోడ్డు సౌకర్యం లేదన్నారు. వంతెన నిర్మించాలన్నారు. పంచాయితీలో తాగునీటి సమస్య కూడా ఉందంటూ వాపోయారు.
 
వీధిలైట్లు సక్రమంగా వెలగలేదన్నారు. గతంలో ఎన్నోసార్లు జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తాము ఇచ్చిన అర్జీలు చెత్తకుండీలో వేసారని, తమ గ్రామానికి అభివృద్ధి చేయకుంటే తాము ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధాకర్ గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు.
 
మంగళవారం ఎన్నికల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఎస్‌ఐ హామీ ఇచ్చారు. గోడలపై ఇలాంటి పోస్టర్లు అంటించకూడదన్నారు. గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాగే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ప్రజలు అంటున్నారు.