కన్నీటి తెరల మాటున తడవకూడదు

మంగళవారం, 13 జూన్ 2017 (21:20 IST)

Love, romance

నీ కన్నులు కైపెక్కించాలి కానీ
కన్నీటి తెరల మాటున తడవకూడదు
నీ ముఖం తెల్లని పద్మంలా విప్పారుతూ వుండాలి కానీ
ఎర్రమందారంలా ఎరుపెక్కకూడదు
 
నీ పెదవులు తమకంతో తడవాలి కానీ
ఆవేదనతో అధరాలు అదరకూడదు
నీ హృదయం ప్రేమామృతం చిందించాలి కానీ
పలు విధాలుగా చింతించకూడదు
 
నీ మాటలు మత్తెక్కించాలి కానీ
మథనపడుతూ వుండకూడదు
నీ స్వరం సంతోషాల సంగమం కావాలి కానీ
దుంఖాల సాగరం కాకూడదు
 
నీ కనులు నీ ముగ్ధమనోహర రూపం
నీ హృదయం నీ పలుకు సంతోషమైతే నాకు వెన్నెలే....
ఆ కనులు ఆ హృదయం ఆ పలుకు ఆవేదనలైతే అమావాస్యలే...
- యిమ్మడిశెట్టి  వెంకటేశ్వర రావుదీనిపై మరింత చదవండి :  
Love Poem

Loading comments ...

ప్రేమాయణం

news

శృంగార శక్తిని పెంచే పూలు ఏమిటో తెలుసా?

ప్రకృతి మనకు ఎన్నో అందమైన, సువాసనలతో కూడిన పుష్పాలను ఇచ్చింది. ఈ పువ్వుల్లో ఒక్కో ...

news

నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు..?

"నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు..!?" అడిగింది ఆత్రుతగా సుజాత "నీలో ఏమీలేదనే ...

news

కౌగిలింతలో అంత హాయి వుందా..? ''బియర్‌ హగ్‌'' గురించి తెలుసా? ప్రేమికులకు చెప్పక్కర్లేదు..

కౌగిలింతతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనలు ఎన్నో తేల్చాయి. ఆప్యాయతతో కూడిన ...

news

అవన్నీ పెళ్ళయ్యాకే..

"పార్కులో కూర్చుని ఓ ప్రేమ జంట ఇలా మాట్లాడుకుంటున్నారు.." "సుజాత.. అస్తమానం ఈ ...