Widgets Magazine

అమ్మాయిలు ఆ కలర్ దుస్తులు వేసుకున్న అబ్బాయిలకు ఫ్లాట్... లవ్ టిప్...

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (13:29 IST)

మనసుకు, మెదడుకు ఉత్తేజాన్నిచ్చే కలర్ ఏంటి? అని చూస్తే పరిశోధకులు చెప్పే మాట ఎరుపు రంగు. ఈ రంగు సాహసం, త్యాగం, శృంగారం, శక్తి, కోపాలకు ప్రతీక. నలుగురిలో త్వరగా ఆకర్షించబడాలంటే ఈ రంగు బాగా ఉపయోగపడుతుంది. ఇదంతా ఎరుపు రంగుకు ఉన్న ప్రత్యేకత. ఇది పక్కన పెడితే... మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల్ని ఆకర్షించడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు.
Red dress
 
కొందరైతే ఖరీదైన నగలు, బైకులు ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. మరికొందరైతే అమ్మాయిలకి చాక్లెట్లు, పూలు, బహుమతులు ఇచ్చి కాకాపట్టాలని ట్రై చేస్తుంటారు. అయితే అబ్బాయిలు ఇక నుంచి ఇటువంటి పాట్లు పడక్కర్లేందటున్నాయి తాజా పరిశోధనలు. అసలు విషయం ఏంటంటారా...? మరి చదవండి.
 
అమ్మాయిలను ఆకర్షించాలంటే ఎర్రటి దుస్తులు వేసుకుంటే చాలని కొత్తగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది. "స్త్రీలకు ఎరుపు రంగు అంటే ఓ శృంగారభరితమైన ఆలోచన" అని రోచెస్టర్, మునిచ్ కళాశాలలకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త ఆండ్రూ ఎల్లియోట్ తెలిపారు. అంతే కాకుండా తమ పరిశోధనలో ఎరుపు రంగు, శృంగారం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్లు కూడా ఆయన అన్నారు.
 
అమెరికా, ఇంగ్లాండ్, జెర్మనీ, చైనా దేశాలలోని అమ్మాయిలు ఇతర రంగుల దుస్తులు వేసుకున్న అబ్బాయిలతో పోలిస్తే ఎరుపు రంగు వేసుకున్న వారినే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తేలింది. టీషర్టు ధరించిన ఓ అబ్బాయి బ్లాక్ అండ్ వైట్ ఫోటో(బ్యాక్‌గ్రౌండ్ ఎరుపు లేదా తెలుపు)లను 35 మంది యువతులకు చూపించగా, నైన్-పాయింట్ స్కేలు ఆధారం చేసుకొని వారు మూడు ప్రశ్నలను అడిగారు. 
 
ఈ వ్యక్తి ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు? చూడటానికి ఈ వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు? ఒకవేళ నేను అతడ్ని ముఖాముఖి కలిస్తే అతడు ఆకర్షణీయంగా ఉన్నాడని ఆలోచిస్తాను? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఎరుపు బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోకి తెలుపు బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోకన్నా ఒక పాయింట్ ఎక్కువగా నైన్-పాయింట్ స్కేలుపై నమోదయ్యింది.
 
ఇదే విషయమై ఇంకొక పరిశోధనలో ఒక ఎరుపు రంగు షర్టు ధరంచిన వ్యక్తి ఫోటోను, మరొక ఆకుపచ్చని రంగు షర్టు ధరించిన ఫోటోను అమ్మాయిలకు చూపించగా అందులో 55 మంది ఎరుపు రంగు ధరించిన వ్యక్తికే ఓటు చేశారు. స్త్రీల విషయంలో ఎరుపు రంగుకు వివిధ సాంప్రదాయలలో ఓ ప్రత్యేకత ఉంటుంది. అదే మగవారికి మాత్రం ఇది స్థిరంగా ఉంటుంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ప్రేమాయణం

news

ఒకమ్మాయి... ఇద్దరు అబ్బాయిలు... కొత్త ప్రేమాయణం ఫార్ములా...

మారుతోన్న కాలం... సాయంత్రపు వేళల్లో పిజ్జా హట్స్‌లోనో, మల్టీప్లెక్సుల్లోనో హేపీగా ఎంజాయ్ ...

news

ప్రేమలేని పెళ్లి జంట జీవితం ప్రేమలేని ఈ పక్షుల కాపురంలా వుంటుంది... చదవండి...

ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే ఒకరికొకరు నచ్చాలి. ప్రేమ పుట్టాలి. ఆ తరువాతే పెళ్ళీ ...

news

అలుపెరుగని నా తలపుల అలల తీరం నీవు

ఉషోదయ వేళలలో నా హృదయాన్ని తాకిన నా ప్రేమా, పొంగిన హృదయంలో అలల అనురాగం అందుకున్నా నీ ...

news

ప్రేమికుల దినోత్సవం : హైదరాబాద్ నగరంలో బెస్ట్ గేట్‌వేస్ ఏవి?

ఈనెల 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం. ఈ వేడుకలను ఒక పండుగలా జరుపుకునేందుకు ప్రేమ జంటలు ...

Widgets Magazine