మహాశివరాత్రి : బాదం పప్పు పాయసాన్ని ట్రై చేశారా?
మహాశివరాత్రి రోజున ఉపవాసాలు పాటించడం చాలా శుభప్రదం మరియు అలా చేస్తే, పరమశివుని అనుగ్రహం పొందవచ్చని భావిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున, ఒకరు శివ పురాణాన్ని పఠించాలి మరియు శివ మంత్రాన్ని పఠించడం మరింత మంచిదని భావించబడుతుంది.
ఈ మహాశివరాత్రి సమయంలో శివుని 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని పఠించడం శివుని అనుగ్రహాన్ని పొందినట్లు భావిస్తారు.
మహాశివరాత్రి రోజున శివ పురాణం యొక్క పురాతన వచనాన్ని పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున శివుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివానుగ్రహం పొందవచ్చు. అదేవిధంగా ఉపవాసం వుండేవారు స్వామికి నైవేద్యంగానూ.. ఉపవాసం వుండేవారు తీసుకునేలా బాదం పప్పు పాయసం తయారు చేసి తీసుకోవచ్చు. బాదం పప్పు పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం..
కావాల్సిన పదార్ధాలు
బాదం పప్పు-250 గ్రా.
పంచదార- 250 గ్రా.
పాలు- అర లీటరు
యాలక్కాయలు, జీడిపప్పు, సారా పప్పు, పిస్తాపప్పు-తలా పది గ్రాములు
కుంకుమ పువ్వు, లేదా కేసరి పౌడర్... రెండు టీ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా బాదంపప్పును వేడి నీటిలో నానబెట్టాలి. ఒకగంట తర్వాత బాదంపప్పుపై గల తొక్కును తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న ముద్దకు 3/4 మోతాదులో నీటిని చేర్చుకుని పచ్చివాసన పోయేవరకు మరగనివ్వాలి.
తర్వాత అందులో పంచదార, నేతిలో వేయించిన జీడిపప్పు, సారా, పిస్తా పప్పులను కలుపుకోవాలి. రంగు కోసం కేసరి పౌడర్ కలపాలి. ఇంకా యాలక్కాయల పొడిని కూడా చేర్చుకోవాలి. అంతే వేడివేడి బాదం పాయసం రెడీ.