మహాశివరాత్రి.. లింగోద్భవ పూజ.. అభిషేకానికి పాలు, పండ్లు ఇస్తే?

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (11:14 IST)

lord shiva

మహాశివరాత్రి పూట రాత్రి ఆలయాల్లో లింగోద్భవం అవతారాన్ని స్మరించుకుంటూ నాలుగు కాలాల పూజ జరుగుతుంది. ఈ నాలుగు కాలాల పాటు మహేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. శివలింగానికి పాలు, పంచామృతం, పండ్లు వంటి వాటితో అభిషేకం చేస్తారు. అయితే తొలి, మలి, మూడు, నాలుగు కాలాల్లో ఏయే పదార్థాలతో అభిషేకం చేయాలని తెలుసుకుందామా.. అయితే ఈ కథనం చదవండి. 
 
మహాశివరాత్రి రోజున శివునికి అభిషేక వస్తువులను, సుగంద ద్రవ్యాలను సమకూర్చే వారికి సకల సంపదలు చేకూరుతాయంటారు ఆధ్యాత్మిక పండితులు. అలాగే శివరాత్రి రోజున జరిగే నాలుగు కాలాల్లో అభిషేకానికి పంచకవ్యం, పంచామృతం, తేనె, చెరకు రసంతో శివునికి అర్పించాలి. చందనం, పచ్చకర్పూరం, కస్తూరితో శివలింగానికి అర్చించాలి. ఎరుపు రంగు వస్తువులు తొలికాలంలోనూ, పసుపు రంగు దుస్తులు రెండో కాలంలోనూ, తెలుపు రంగు వస్తువులు మూడో కాలంలో, పచ్చరంగు దుస్తులు నాలుగో కాలంలో శివునికి సమర్పించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఈ పూజా సమయాల్లో శివపురాణం, లింగాష్టకం పఠించాలి. ఆలయాల్లో నెయ్యి, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. తామర, బిల్వతో పాటు అన్నీ రకాల పువ్వులను స్వామికి సమర్పించుకోవచ్చు. పండ్లు పనస, దానిమ్మ, అరటితో పాటు అన్నీ పండ్లను మహాదేవునికి సమర్పించి.. ఆయన అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

టిటిడి బోర్డుకు బిజెపి పీటముడి.. ఏంటది?

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటు కోసం దాదాపు 10 నెలలుగా అందరూ ఉత్కంఠతో ...

news

శివరాత్రి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి...?(Video)

సాధారణంగా ప్రతి నెలా కృష్ణపక్షమి రోజున శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ...

news

మహాశివరాత్రి రోజున ఆ మంత్రాలను జపిస్తే..?(Video)

''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ ...

news

ఒకవైపు శివనామ స్మరణలు - మరోవైపు గోవింద నామస్మరణలు..(Video)

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో కపిలేశ్వరస్వామి, శ్రీనివాసమంగాపురం కళ్యాణ వెంకటేశ్వరస్వామి ...