ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (12:24 IST)

వధువులకు గుడ్ న్యూస్.. అరుంధతి గోల్డ్ స్కీం కింద ఒక తులం

నూతన వధువులకు అసోం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. తక్కువ ఆదాయమున్న వధువులకు అరుంధతి గోల్డ్ స్కీం కింద అసోం ప్రభుత్వం ఒక తులం బంగారాన్ని బహుమతిగా అందించాలని నిర్ణయించింది. దీనికోసం 2019-20 సంవత్సరం బడ్జెట్‌లో రూ.300కోట్లను కేటాయించింది. ఐదు లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల్లోని వధువులకు ఈ బంగారం బహుమతిగా ఇవ్వనున్నారు. 
 
ఈ పథకం మొదటి ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే లభిస్తోంది. పెళ్లి సమయంలో ప్రభుత్వం వధువులకు బంగారం బహుమతిగా అందించనుంది. దరఖాస్తుదారులు వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న రోజే అరుంధతి బంగారు పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. మొదటి వివాహానికే ఈ బంగారం బహుమతిగా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.