10 యేళ్ల బాలికపై 38 యేళ్ళ స్వీపర్ అత్యాచారం

rape
Last Updated: ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (11:37 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. పదేళ్ళ బాలికపై 38 యేళ్ల స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని ఓ పాఠశాలలో పదేళ్ళ చదువుతోంది. ఈ బాలిక ఈనెల ఐదో తేదీన పాఠశాలను వదిలివెళ్లే సమయంలో స్వీపర్‌ వచ్చి స్కూళ్లోని ఓ ప్రదేశం చూపిస్తూ అక్కడ కూర్చోవాల్సిందిగా చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బాలికను బలవంతంగా మరో సీట్లోకి లాక్కొనిపోయి అత్యాచారం చేశాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. ఆ తర్వాత బాలిక జరిగిన విషయాన్నంతా బంధువులకు తెలిపింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.దీనిపై మరింత చదవండి :