శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 30 మే 2016 (14:38 IST)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ వరదలు : 12 మంది మృతులు

ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర భారతంలోని నదులు పొంగడానికి సిద్ధంగా ఉన్నాయి. వరద నీరు భారీ స్థాయిలో నదుల్లో చేరడంతో నదుల్లో నీటి ప్రవాహం ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గాలివానలు, పిడుగుపాటుతో కూడిన వర్షం కారణంగా 12 మంది మృతిచెందారు. 
 
కాన్పూర్ బిల్హార్ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందారు. మావు జిల్లాలో ఒకరు మరణించారు. వారణాసిలోని శివపురి ప్రాంతంలో చెట్టు కూలి పడడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రామగావ్‌లో మట్టి ఇల్లు కూలిపోవడంతో ఒక మహిళ దుర్మరణం చెందింది. 
 
అజాంఘడ్‌లోని అసండీహ్ గ్రామంలో పాఠశాల గేటు కూలి ఇద్దరు చిన్నారులు, ఫరుఖహాబాద్‌లో పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు. మధురాలో కరెంట్ షాక్ తగిలి ఒకరు మృతి చెందారు. వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.