శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (17:39 IST)

విదర్భలో 20 మంది రైతులు మృతి.. కంటిచూపు కూడా కోల్పోయారు..

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 20 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. పత్తి చేలకు పురుగులమందు పిచికారి చేస్తూ ఇప్పటి వరకు 20 మంది రైతులు మరణించారు. పలువురు కంటిచూపు కోల్పోయారు. ముంబైకి 670 కిలోమీటర్ల దూ

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 20 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. పత్తి చేలకు పురుగులమందు పిచికారి చేస్తూ ఇప్పటి వరకు 20 మంది రైతులు మరణించారు. పలువురు కంటిచూపు కోల్పోయారు. ముంబైకి 670 కిలోమీటర్ల దూరం ఉన్న యావత్మాల్ జిల్లాలో అధికారులు హైలర్ట్ ప్రకటించారు.
 
ఈ ప్రాంతంలో పత్తి చేలకు పురుగులమందు పిచికారీ చేస్తూ ఆ వాసనలు పీల్చడంతో గత నెలలో 20 మంది చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 600 మంది రైతులు పురుగులమందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురైయ్యారు. వీరిలో వంద మందికి పైగా వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.2లక్షల నష్టపరిహారం ప్రకటించారు.