శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: బుధవారం, 1 ఏప్రియల్ 2015 (08:06 IST)

జైలు నుంచి ఐదు మంది ఖైదీలు పరార్... ఎక్కడ?

నేరపూరితమైన కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదు మంది కేటుగాళ్లు జైలు నుంచి తప్పించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున వారు జైలు అధికారులను సిబ్బందిని బురిడీ కొట్టించి బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
మధ్యప్రదేశ్కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తా,నేపాల్కు చెందిన ఆకాశ్ ఘోలు, ప్రేమ్ లు వివిధ కేసులలో నాగ్ పూర్లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ జైలుకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నాగ్పూర్ సెంట్రల్ జైలు నుంచి ఈ  ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. సరిగ్గా అర్థరాత్రి దాటకా 2 నుంచి 4గంటల ప్రాంతంలో వారు జైలులో నుంచి తప్పించుకున్నారు. 
 
వీరిలో ముగ్గురిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైం యాక్ట్ కింద కేసులు నమోదై ఉన్నాయి. మరో ఇద్దరిపై ఆయుధాల చట్టం, దొంగతనం కేసులు ఉన్నాయి. మరో ఇద్దరు మాత్రం అని గుర్తించారు. మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురిపై 425 సెక్షన్(ఆయుధాల చట్టం), 392 సెక్షన్ (దొంగతనం) కింద కేసులు ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు.