గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (06:45 IST)

తమిళనాడులో 700 మంది ఖైదీల విడుదల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎన్‌.అన్నాదురై జయంతి సందర్భంగా ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 700 మంది ఖైదీలను విడుదల చేస్తామని తమిళనాడు సిఎం ఎంకె.స్టాలిన్‌ ప్రకటించారు.

పోలీస్‌ శాఖలో గ్రాంట్ల డిమాండుకు సంబంధించి జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ 700 మంది జీవిత ఖైదీల శిక్షను తగ్గించేందుకు, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని మానవతా కోణంలో వారిని ముందస్తుగా విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేస్తామని వెల్లడించారు. నీట్‌, ప్రభుత్వ మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిపై గత అన్నాడిఎంకె ప్రభుత్వం పెట్టిన కేసులను కూడా ఉపసంహరిస్తామన్నారు.

సిఎఎ, రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపై నమోదైన 5,570 కేసులను వెనక్కు తీసుకుంటామన్నారు.