Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియురాలి శవాన్ని బైకుపై వేసుకుని తీసుకొచ్చిన ప్రియుడు... ఏం జరిగిందంటే?

మంగళవారం, 11 జులై 2017 (18:50 IST)

Widgets Magazine
crime

కర్నాటకలో ఓ యువతి శవాన్ని బైకుపై వేసుకుని రోడ్డుపై వెళుతున్న యువకుడిని చూసి షాక్ తిన్నారు జనం. అతడు నేరుగా ఆ యువతి శవాన్ని తీసుకుని బళ్లారిలోని పోలీసు స్టేషనుకు తీసుకెళ్లి అసలు విషయం చెప్పాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... 24 ఏళ్ల దావల్ సాబ్ సిరిగేరి గ్రామానికి చెందినవాడు. ఇతడు 21 ఏళ్ల చాకలి హనుమంతి అనే యువతిని ప్రేమించాడు. వీరి మధ్య గత మూడేళ్లుగా ప్రేమాయణ సాగుతోంది. 
 
విషయం ప్రియుడి ఇంట్లో తెలియడంతో వారి పెళ్లికి ససేమిరా అన్నారు అతడి తల్లిదండ్రులు. ఐతే హనుమంతి మాత్రం తనను పెళ్లాడాలని ఒత్తిడి తెచ్చింది. దీనితో ఆమెను బైకుపై ఎక్కించుకుని గ్రామ శివార్లకు తీసుకెళ్లి... నీపై అనుమానం వున్నదనీ, నువ్వు మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావనీ, అందువల్ల తనకు మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందని చెప్పాడు. ఐతే దానికి ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. 
 
దానితో ఆగ్రహంతో... నీవు ఉంటే నా పెళ్లికి అడ్డంకి అందుకే నీవు ఉంటేఉండు లేకపోతే చావు అంటూ కేకలు వేశాడు. దాంతో తన ప్రియుడు లేని జీవితం వ్యర్థమని ఆమె సమీపంలో వున్న చెట్టు చాటుకు వెళ్లి తన పైట చెంగుతో  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెట్టు చాటుకు వెళ్లిన ప్రేయసి ఎంతకీ రాకపోవడంతో అతడు అటుగా వెళ్లి చూస్తే ఆమె శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమె శవాన్ని కిందికి దించి దాన్ని తీసుకుని నేరుగా అతడు పోలీసు స్టేషనుకు వెళ్లి జరిగినదంతా వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అతివేగానికి బీటెక్ విద్యార్థి మృతి.. బంజారాహిల్స్‌లో కారు ప్రమాదం (Video)

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో మరో ఘోర రోడ్డు ...

news

మరో 40 యేళ్ళు జగనే సిఎం... నవ హామీలపై నా సవాల్... రోజా(వీడియో)

ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తే జగన్ ఇచ్చిన 9 హామీలను ఎలా ...

news

జయలలితను పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి నమ్మించి గొంతుకోశాడు: శశికళ భర్త నటరాజన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. వివాహం కాలేదని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఆమెకు ...

news

జెసి సహనం కోల్పోవద్దు - జాగ్రత్త.. బాబు క్లాస్

దేనికైనా ఒక సందర్భం ఉంటుంది. అన్నిటికీ కోప్పడితే ఎలా... మనం అలా ప్రవర్తించకూడదు. ...

Widgets Magazine