Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లైంగిక దాడి జరిగిందని చెప్పినా వినలేదు.. చెవి కొరికి చేత బట్టుకుని...

శనివారం, 7 అక్టోబరు 2017 (11:46 IST)

Widgets Magazine
rape victim

లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. బాధితురాలు తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి చెవిని చేతబట్టుకుని పోలీసుల వద్దకు వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. లైంగిక దాడి జరిగిందని చెప్పినా పట్టించుకోని పోలీసులు... ప్రత్యక్ష సాక్ష్యంగా కొరికిన చెవిని తీసుకురావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే గత సోమవారం తన పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి దిగారు. ఇంటి బయట ఉన్న గదిలో ఆమె భర్త.. భార్య కేకలు విని ఇంట్లోకి పరిగెత్తుకొచ్చాడు. దీంతో, మిగిలిన ముగ్గురు అతడిపై తీవ్రంగా దాడి చేస్తుండగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తి చెవిని బాధితురాలు కొరికిపారేసింది.
 
ఆ తర్వాత వారు జరిగిన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి వెళ్లిపోయారు. ఈ మేరకు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా రెండు రోజులపాటు స్థానిక పోలీసులు కేసు నమోదుచేసుకోలేదు. దీంతో బాధితురాలు ఏం చేయాలో పాలుపోక.. నిందితుడి చెవిని కొరికిన విషయం గుర్తుకుతెచ్చుకొని ఆ భాగాన్ని తీసుకొని నేరుగా ఎస్‌పి కార్యాలయానికి చేరింది. దీంతో ఎస్పీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బావ మరదలిని చంపేశాడు.. భార్యను భర్త కొడవలితో నరికేశాడు..

మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గ్యాంగ్ రేప్‌లతో పాటు హత్యా నేరాల సంఖ్య ...

news

హిందూపురం నుంచి పోటీపై పురంధేశ్వరి.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఏమన్నారు?

వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బీజేపీ నేత పురంధేశ్వ‌రి పోటీ చేయనున్నారని ...

news

యూపీలో ఘోరం.. భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్ రేప్.. చెట్టుకు కట్టేసి?

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. భర్త ముందే ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. భర్తను చెట్టుకు ...

news

మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి యువతిపై రేప్ చేసిన దొంగ బాబా

గోవాలో 19ఏళ్ల యువతికి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి ఓ అతిథి గృహానికి తీసుకెళ్లి ...

Widgets Magazine