శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (11:40 IST)

యూపీలో ఘోరం.. భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్ రేప్.. చెట్టుకు కట్టేసి?

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. భర్త ముందే ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. భర్తను చెట

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. భర్త ముందే ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. భర్తను చెట్టుకు కట్టేసి, బిడ్డను చంపేస్తామని బెదిరించి.. ఓ మహిళపై నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ దంపతులు తన చిన్నారిని ఆస్పత్రిలో చూపించి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. తుపాకులతో బెదిరించారు. టూవీలర్ నడిపిన వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లారు. భర్తను చెట్టుకు కట్టేసి అక్కడే అతడి కళ్ల ఎదుటే భార్యపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. 
 
అటుగా వచ్చిన రైతులు తమని కాపాడి స్థానిక ఆస్పత్రికి తరలించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.