Widgets Magazine

కన్నతండ్రి కళ్లెదుటే కుమార్తెను తగలబెడుతుంటే...

గురువారం, 3 మే 2018 (14:59 IST)

కేరళలో ఓ వివాహితను కట్టుకున్న భర్తే ఆమె కన్నతండ్రి కళ్లెదుటే పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ సమయంలో చుట్టుపక్కల వారు కళ్లప్పగించి చూస్తుండిపోయారే గానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
burn
 
కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా, చెంగళూరుకు చెందిన జీతూ(29) అనే విరాజ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిమధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టులో సాగుతోంది. అయితే, విరాజ్‌ తన భార్యపై కక్ష పెంచుకుని, ఆమెను ఏ విధంగానే హతమార్చాలన్న ధోరణితో ఉన్నాడు. 
 
ఈ క్రమంలో ఓ రుణం నిమిత్తం జీతూ తన తండ్రితో కలిసి చెంగళూరులోని కుదుంబశ్రీ కార్యాలయానికి వచ్చి, అక్కడి అధికారులతో మాట్లాడుతున్న సమయంలో విరాజ్‌ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ.. విరాజ్ వెంటపడి నిప్పంటించాడు. 
 
ఆసమయంలో అక్కడే ఉన్న జీతూ తండ్రి తన కుమార్తెను కాపాడాలని బోరున విలవిస్తూ వేడుకున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకోలేదు. ఇంతలో కాలిన గాయాలతో జీతూ కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేయాలని ప్రాధేయపడినా ఏ ఒక్కరూ కనికరించలేదు. 
 
ఈ ఘటన తర్వాత విరాజ్‌ అక్కడి నుంచి పారిపోగా.. చివరకు ఓ ఆటోడ్రైవర్‌ సాయంతో జీతూ తండ్రి ఆమె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జీతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జీతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విరాజ్‌ను బుధవారం రాత్రి ముంబైలో అరెస్టు చేశారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రేప్ చేసేందుకు వస్తే... అది కోసి చేతిలో పెట్టింది.. ఎక్కడ?

ఒంటరి మహిళ కదా అత్యాచారం చేస్తే ఏమవుతుంది.. ఎవరికి చెప్పుకుంటుందిలే అనుకున్నాడు ఓ ...

news

జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. రాష్ట్రపతి గంటే వుంటారట

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రపతి తీసుకున్న ఓ నిర్ణయం ఈ ...

news

దాచేపల్లి ఘటన.. బాలికకు చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం.. ఉద్రిక్తత

కామాంధులు వయోభేదం లేకుండా విరుచుకుపడుతున్నారు. కథువా, ఉన్నావో లాంటి ఘటనలతో 12 ఏళ్లలోపు ...

news

సవతి తల్లితో అక్రమ సంబంధం.. ఆపై అనుమానంతో?

మానవ సంబంధాలను మంటగలిపేశారు. స్వయానా సవతి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆపై ఆమెను ...

Widgets Magazine