శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 25 నవంబరు 2015 (13:07 IST)

ఎందుకొచ్చిన తంటా... కొన్నాళ్లు ముంబై వదిలి వెళ్లు...భార్యకు అమీర్ సలహా..?

అసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ముంబైలోని ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న కొందరు ఆందోళనకారులు అమీర్ ఇంటి బయట ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో అమీర్ ఖాన్ తన భార్యాబిడ్డ భద్రతపై కాస్తంత ఆందోళన చెందినట్లు సమాచారం. అందుకని రెండు మూడు రోజులు ముంబై నగరాన్ని విడిచి దూరంగా ఉండాలని భార్యకు సలహా ఇచ్చినట్లు సమాచారం. 
 
కాగా అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతూనే ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీ, వామపక్ష పార్టీలు మాత్రం తన భార్య ఏం చెప్పిందో అది ఆయన నిర్భయంగా చెప్పారు. అందులో తప్పేముంది. ఈ స్వేచ్ఛా భారతంలో ఆయన తన భార్య చెప్పిన విషయాన్ని స్పష్టం చేశారు. దీనిపై ఇంత రగడ ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నాయి.