శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (16:08 IST)

మహారాష్ట్ర కాంగ్రెస్ చేయి జారింది.. బీజేపీ కూటమిదే విజయం!

వచ్చే నెలలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ - ఎన్సీపీ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఓ మరాఠీ చానెల్ నిర్వహించిన ముందస్తు సర్వేలో వెల్లడైంది. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 103, శివసేన 64 చొప్పున సీట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమికి కేవలం 65 సీట్లు దక్కవచ్చని తెలిపింది. 
 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఏబీపీ మాజా చానెల్, నీల్సన్ సంస్థలు కలిసి ఈ సర్వే నిర్వహించాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఒంటరిగా బరిలోకి దిగితే బీజేపికి 103, శివసేనకు 64 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. మరోవైపు కాంగ్రెస్‌కు 49, ఎన్సీపీకి 40 స్థానాలు వచ్చే అవకాశాలుండగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)కు 11 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని ఇది అంచనా వేసింది. 
 
ఇదిలావుండగా ప్రస్తుతం ఉన్నట్టుగానే ప్రజాసామ్య కూటమి, మహాకూటమిగా పొత్తులతో పోటీ చేసినట్టయితే మహాకూటమికి (బీజేపీకి 107, శివసేన 86, ఆర్పీఐ 5, స్వాభిమాని శేత్కారికి రెండు) 200 సీట్లు వచ్చేఅవకాశాలున్నాయని సర్వేలో తేలింది. అలాగే, కాంగ్రెస్‌కు 40, ఎన్సీపీ 25కి సీట్లు వస్తాయని ఈ చానెల్ లెక్కిగట్టింది. అంటే ప్రజాస్వామ్య కూటమికి మొత్తం 65 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ఎమ్మెన్నెస్‌కు 10 స్థానాలు వచ్చే సూచనలు ఉన్నాయని పేర్కొంది.