మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (10:38 IST)

చిన్నాన్న కోసం ప్రచార బరిలోకి కుమార్తె.. ఎక్కడ?

తమిళనాడు రాష్ట్ర శాసనసభ ప్రముఖ నటుడు కమల హాసన్‌ పోటీ చేస్తున్నారు. మక్కల్ నీది మయ్యం పేరుతో ఆయన పార్టీని స్థాపించారు. ఇపుడు ఈ పార్టీ నేతృత్వంలో తృతీయ కూటమి ఏర్పాటైంది. అదేసమయంలో కమల్ హాసన్ కోవై సౌత్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈయన అన్న కుమార్తె సినీ నటి సుహాసిని. ఈమె కమల్‌‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. 
 
ఈ మేరకు తమ పార్టీ తరపున ప్రచారం చేయనున్న వారి జాబితాను మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించింది. అందులో నటి శ్రీప్రియ, సినీ గేయరచయిత స్నేహన్, నటి సుహాసిని, మణిరత్నం సహా 13 మంది ఉన్నారు. 
 
తన చిన్నాన్న కమల్ తరపున ప్రచారం చేయనుండడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సుహాసిని పేర్కొన్నారు. పార్టీ ప్రచార ప్రతినిధిగా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కార్డు లభించిన వెంటనే ప్రచారానికి వెళ్తానని సుహాసిని తెలిపారు. కాగా, సుహాసిని ఎవరో కాదు.. కమల్ హాసన్ అన్న చారుహాసన్ కుమార్తెనే.