శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (12:08 IST)

సీఎం పళనిసామితో వరలక్ష్మి భేటీ.. ఎందుకంటే..?

తమిళ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు అన్నాడీఎంకేలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీప, పన్నీర్ సెల్వం వంటి నేతలు అన్నాడీఎంకేను చిన్నమ్మ చేతుల్లో నుం

తమిళ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు అన్నాడీఎంకేలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీప, పన్నీర్ సెల్వం వంటి నేతలు అన్నాడీఎంకేను చిన్నమ్మ చేతుల్లో నుంచి లాగి.. కాస్త ఊరట నిచ్చినా, చిన్నమ్మ ఎంపిక చేసిన నేత ఎడప్పాడి పళనిసామినే సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
 
ఇప్పటికే దీప పోయెస్ గార్డెన్‌లోకి వెళ్ళి హై డ్రామా సృష్టించిన నేపథ్యంలో.. తాజాగా సినీ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఉన్నట్టుండి సోమవారం సీఎం పళనిసామితో భేటీ అయ్యారు. మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భంగా పళనిసామితో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మార్చి ఒకటో తేదీన వరలక్ష్మి మహిళల భద్రత కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. 
 
ఈ వ్యవస్థ నటీమణులకే కాదు.. లైంగిక వేధింపులకు గురయ్యే అన్ని వర్గాల మహిళల కోసం ఏర్పాటైందన్నారు. భావన కిడ్నాప్‌కు గురైన సందర్భంగా తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని బోల్డ్‌గా చెప్పిన వరలక్ష్మి.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు బ్రేక్ వేసే దిశగా.. వేవ్ శక్తి అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తమిళ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిసామితో భేటీ అయ్యారు. 
 
అనంతరం వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల కారణంగా మహిళలు మానసికంగానూ, శారీరకంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మహిళా కోర్టులు ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు తెలిపింది. ఈ  కోర్టులు మహిళలపై వేధింపుల కేసులపై ఆరు నెలల్లో తీర్పును వెలువరించాలని సీఎంను కోరినట్లు చెప్పారు.