శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (13:14 IST)

పన్నీర్‌తో వార్.. జయ సమాధివద్ద శశికళ నిరాహార దీక్ష.. ఎమ్మెల్యేలు చేజారిపోవడమే కారణమా?

తమిళనాట నరాలు తెగే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పన్నీర్ సెల్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు శశికళ సిద్ధమవుతున్నారు. తనను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఆహ్వానించకుండా గవర్నర్ విద్యాసాగరరావు జాప్యం చ

తమిళనాట నరాలు తెగే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పన్నీర్ సెల్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు శశికళ సిద్ధమవుతున్నారు. తనను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఆహ్వానించకుండా గవర్నర్ విద్యాసాగరరావు జాప్యం చేయడంపై కినుక వహించారు. దీంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి మెరీనా బీచ్‌లో ఆదివారం నిరాహారదీక్ష చేయాలని భావిస్తున్నారు. 
 
జయలలిత సమాధివద్ద శశికళ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. జరుగుతున్న జాప్యం వల్ల తనకు నష్టం తప్పదని చిన్నమ్మ భావిస్తున్నారు. ఒక్కొక్కరుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం శిబిరంలో చేరుతుండడం ఆందోళన కలిగిస్తుంది. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే చాలా మంది చేజారిపోయే అవకాశం ఉందని చిన్నమ్మ భావిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు వెళ్తున్నారు. తాజాగా మరికొంతమంది ఎమ్మెల్యేలు పన్నీరుతో జత కలిశారు. మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు పన్నీరు పక్కన చేరారు. ఎంపీలు సెంగుత్తువన్, జయసింగ్‌లు ఆదివారం పన్నీరు నివాసానికి చేరుకున్నారు. ఆయనకు మద్దతు ప్రకటించారు.