శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (08:53 IST)

జల్లికట్టు ఉద్యమం వెనుక శశికళ హస్తం.. కట్టుతెగడంతో చేతులెత్తేశారు...

దేశాన్ని ఓ ఊపుఊపిన... జల్లికట్టు ఉద్యమం వెనుక అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళ హస్తమున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉన్న కోపంతో పాటు.. జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని తొలగ

దేశాన్ని ఓ ఊపుఊపిన... జల్లికట్టు ఉద్యమం వెనుక అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళ హస్తమున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉన్న కోపంతో పాటు.. జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని తొలగించుకోవాలన్న పంతంతో చిన్నమ్మ జల్లికట్టు ఉద్యమకారులకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఉద్యమం జరిగినంతకాలం వారికి అవసరమైన అన్నపానీయాలను ఆమె అనుచరులు సమకూర్చినట్టు సమాచారం. అయితే, చివరి రోజున ఉద్యమంలోకి కొందరు సంఘ విద్రోహశక్తులు చొరబడటంతో జల్లికట్టు ఉద్యమం కట్టుతప్పిం... చెన్నై నగరం రణరంగంగా మారింది. 
 
ఈ సంప్రదాయక క్రీడపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ ఎక్కడో మదురైలో ప్రారంభమైన జల్లికట్టు ఉద్యమం.. చెన్నైలోని మెరీనా తీరం కేంద్రం ఉధృతంగా జరగడానికి ప్రధాన కారణం అన్నా డీఎంకె నాయకురాలు శశికళ పాత్రేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమం ఊపందుకోవడానికి ఆమె సహకరించారని, జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా పరోక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని ప్రచారం సాగుతోంది.
 
కేంద్రం మీద, ముఖ్యంగా ప్రధాని మోడీపై ఆగ్రహంతోబాటు నిషేధాన్ని రద్దు చేయించుకోవాలన్న పట్టుదలతో శశికళ ఉద్యమానికి సహకరించారని వార్తలు వస్తున్నాయి. ఆందోళనను ఉధృతం చేయించి రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందేలా చూసి ఆమె సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. అయితే, ఒక దశలో జల్లికట్టు ఉద్యమం ఆమె చెయ్యి దాటిపోయింది. విద్యార్థులను అదుపు చేసేవారు లేకపోయారు. ఫలితంగా చెన్నై నగరం ఒకరోజంతా రణరంగాన్ని తలపించింది.