శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (01:01 IST)

హఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోవాలా.. ఆధారాలు చూపించు సిద్ధప్పా.. అంటున్న తెంపరి పాక్

అమెరికా దెబ్బకు జడుసుకుని పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాది జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో గృహనిర్బంధంలోకి తీసుకున్నప్పటికీ దాని బుద్ది ఏమాత్రం మారలేదనేందుకు దాఖలాలు కనిపిస్తున్నాయి. అమెరికాకు భయపడి హఫీజ్‌ని అరెస్టు చేయలేదని, జ

అమెరికా దెబ్బకు జడుసుకుని పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాది జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో గృహనిర్బంధంలోకి తీసుకున్నప్పటికీ దాని బుద్ది ఏమాత్రం మారలేదనేందుకు దాఖలాలు కనిపిస్తున్నాయి. అమెరికాకు భయపడి హఫీజ్‌ని అరెస్టు చేయలేదని, జాతి ప్రయోజనాల కోసమే అతడిని అదుపులోకి తీసుకున్నానని పాక్ నాలుక మడత పెట్టినప్పుడే దాని ద్వంద్వ స్వభావం బాగా అర్థమైంది. ఇప్పుడు హఫీజ్ నేరం చేసి ఉండే పకడ్బందీ ఆధారాలు చూపించాలని చెప్పిన పాక్ మరోసారి భారత్‌కు జలక్ ఇచ్చింది. 
 
2008లో ముంబయిలో పేలుళ్లకు సంబంధించి కీలక సూత్రదారి అయిన హఫీజ్‌ను ఇప్పటికే పాక్‌ ప్రభుత్వం గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. అయితే ముంబయి పేలుళ్లకు సంబంధించి స్పష్టమైన పకడ్బంధీ ఆధారాలు తమకు అందించాలని భారత్‌ను కోరిన పాక్ ప్రభుత్వం ముంబై దాడుల కేసు విచారణను మళ్లీ మొదటికి తెచ్చింది. 
 
ఉగ్రవాది, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ నేర చరిత్రకు సంబంధించిన ఆదారాలన్నీ కూడా పాకిస్థాన్‌కు అందుబాటులో ఉన్నాయని భారత్‌ స్పష్టం చేసింది. 
 
పాక్  సమాధానానికి భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ స్పందిస్తూ ముంబయి దాడికి సంబంధించిన ప్రణాళిక మొత్తం పాక్‌లోనే జరిగిందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు కూడా పాక్‌ నుంచే వచ్చారని, అందుకే ఆధారాలు కూడా పాక్‌లోనే ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఆయన బదులిచ్చారు.
 
పాకిస్తాన్ మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాలను చూసైనా ఉగ్రవాద నియంత్రణ విషయంలో కాస్త మారుతుందని ఆశించినవారికి తాను మారను గాక మారనంటూ పాక్ తెగెసి చెప్పడం విస్మయం గొలిపిస్తోంది. ట్రంప్ వ్యక్తిగతంగా ఎలాంటి వాడయినా ఉగ్రవాద చర్యలపై కఠిన వైఖరి అవలంబించడం తగినదేనని ఇప్పటికీ అనేక మంది బావిస్తున్నారంటే అందుకు పాక్ వంటి దేశాల వైఖరే కారణం.