శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (09:23 IST)

జమ్మూలోని టెర్రరిస్టులు తలచుకుంటే ఏమైనా చేయగలరు: ఫరూక్ అబ్ధుల్లా

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్ధుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని టెర్రరిస్టులు తలచుకుంటే ఏమైనా చేయగలుగుతారని, భారత సైన్యమంతా కలిసినా వారిని అడ్డుకోలేరని ఫరూక్ అబ్ధుల్లా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీరును ఆ దేశానికి వదిలేయాలంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూక్ మరోసారి తన కామెంట్స్‌తో వేడి పుట్టించారు. 
 
జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్టులు నిర్ణయించుకుంటే , తనతో సహా ఎవరినైనా హత్య చేయగలుగుతారని, సైనికులను అందరినీ తెచ్చి మోహరించినా వారిని ఆపలేరని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీరును ఆ దేశానికే వదిలేయాలంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూక్ మరో మారు వేడిని రగిల్చారు. 
 
పౌర సమాజ సభ్యులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్-పాకిస్థాన్ సమస్యలను ఇరు దేశాలూ చర్చలు జరపడం ద్వారానే పరిష్కరించుకోవాల్సి వుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాలూ యుద్ధం చేసినా పీఓకేను భారత్, ప్రస్తుత జమ్మూకాశ్మీర్‌ను పాకిస్థాన్ పొందలేవని తేల్చి చెప్పారు.