కమల్ హాసన్ విరాళాలు తిరిగి ఇచ్చేస్తున్నారా? అసలేం జరుగుతోంది?

గురువారం, 16 నవంబరు 2017 (16:49 IST)

kamal haasan

రాజకీయ పార్టీ కోసం అభిమానులు సేకరించి పంపే ధనాన్ని సినీ లెజెండ్ కమల్ హాసన్ తిరిగి వారికే పంపుతున్నారు. రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకున్నాను. దానికి ప్రజలే సహకరిస్తారని.. గతంలో కమల్ హాసన్ తెలిపారు. అయితే ప్రజల వద్ద సేకరించిన విరాళాలతో పార్టీని నడపటం సరికాదని అన్నాడీఎంకే మంత్రులు విమర్శలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో విరాళాలపై కమల్ హాసన్ ఓ పత్రికకు రాసిన కథనంలో తెలిపారు. పార్టీ ప్రారంభించేందుకు ప్రజలే సహకరిస్తారని.. ప్రజలే ధనాన్ని ఇస్తారని పేర్కొన్న తన వ్యాఖ్యలకు మారుగా అభిమానులు ఇస్తారని మీడియా వార్తలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం తన అభిమానుల నుంచి తనకు ఉత్తరాలతో పాటు డబ్బు కూడా రావడం ప్రారంభమైంది. 
 
అయితే ప్రస్తుతం ఆ డబ్బును తాను తీసుకుంటే చట్ట విరుద్ధమవుతుంది. ఆ ధనాన్ని అలాగే వుంచుకోకూడదు. అందుకే ఆ ధనాన్ని తిరిగి పంపుతున్నా.. దీనికి అర్థం తాను విరాళాలు తీసుకోనని కాదు. తమ పార్టీకి ఇంకా పేరే పెట్టలేదని ఎలాంటి సదుపాయాలు లేకుండానే సేకరించిన విరాళాలను దాచుకుంటే అది నేరమవుతుందని ఆర్టికల్ లో పేర్కొన్నారు. రాజకీయ పార్టీని పెట్టడం కోసం తన అభిమానులు రూ. 30 కోట్ల విరాళాలను సేకరించారని తెలిపారు. "ఆ డబ్బు మీకు తిరిగి ఇచ్చేసినా అది నా డబ్బుగానే భావించాలి.
 
ఒకవేళ ఖర్చు చేసేస్తే.. మీ వద్ద నుంచి విరాళాలు పొందే భాగ్యం నాకు లేదనుకుంటాను" అంటూ కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. దీని ప్రకారం రాజకీయ పార్టీ ఏర్పరిచిన తర్వాత విరాళాలను తనకు పంపితే సరిపోతుందని.. అప్పటివరకు ఆ డబ్బును మీరు భద్రంగా వుంచుకోవాలని కమల్ హాసన్ తన ఫ్యాన్సుకు చెప్పకనే చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
హిందూ ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ.. దేశంలో అధిక జనాభా హిందువులదేనని, ఇతర మతస్తులకు హిందువులు అన్నల్లాంటి వారని, ఇతర మతాలవారిని అక్కున చేర్చుకోవాలని, వారు తప్పు చేస్తే సరిదిద్దాలని సూచించారు. తాను హిందువుల కుటుంబం నుంచి వచ్చానని. వారికి తాను వ్యతిరేకం కాదని కమల్ హాసన్ తెలిపారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్రమాస్తుల కేసు : శశికళ బంధువుకు ఐదేళ్ళ జైలుశిక్ష

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబానికి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ...

news

ఆ విషయంలో తమ్ముడితో గొడవ పడిన మాజీ సిఎం

వద్దూ.. వద్దంటున్నా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేందుకు తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ...

news

15 ఏళ్ల బాలుడితో 36ఏళ్ల మహిళ లైంగిక సంబంధం.. మగశిశువు జననం

36ఏళ్ల మహిళ సభ్యసమాజం తలదించుకునే చర్యకు పాల్పడింది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే తన కుమారుడి ...

news

బుద్ధి గడ్డి తిని ప్రియురాలిని చేసుకున్నా... ప్లీజ్ రక్షించండి... లేదంటే దూకేస్తా...

అయ్యా.. నేను నా భార్యతో వేగలేను. నన్ను రాచిరంపాన పెట్టేస్తోంది. నావల్ల కావడం లేదు. దయచేసి ...