బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 13 నవంబరు 2017 (13:52 IST)

చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం అదే... పోసాని కృష్ణమురళి

సినిమా ఇండస్ట్రీలో ఉన్నదివున్నట్లుగా చెప్పే నటుల్లో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. ఆయన ఏదయినా చెప్పదల్చుకుంటే మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అవతలివారు ఏమనుకున్నా చెప్పేందుకు ఎంతమాత్రం జంకరు. తాజాగా ఆయనను ఓ మీడియా ఇంటర్వ్యూలో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న

సినిమా ఇండస్ట్రీలో ఉన్నదివున్నట్లుగా చెప్పే నటుల్లో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. ఆయన ఏదయినా చెప్పదల్చుకుంటే మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అవతలివారు ఏమనుకున్నా చెప్పేందుకు ఎంతమాత్రం జంకరు. తాజాగా ఆయనను ఓ మీడియా ఇంటర్వ్యూలో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న ఒకటి అడిగారు. చిరంజీవి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. బాధగా అనిపించలేదా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
 
అసలు చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కులమే కారణం. ఆయన సినిమాల్లో అందరివాడిలా వున్నా, రాజకీయాల్లోకి వచ్చేసరికి కాపు కులస్తుడంటూ ముద్రవేశారు. అంతెందుకు నా విషయానికే వస్తే నాకూ కులపిచ్చి ఉంది. అసలు కులపిచ్చి ఎవరికి లేదో మీరే చెప్పండి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశా. నన్ను ప్రజలు బాగానే ఆదరించారు. అయితే కొన్నిచోట్ల నా ప్రచారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నువ్వు కాపువి కదా.. నీకు ఎందుకు ఓటు వెయ్యాలి. కాపులకు ఓటేస్తే మిగిలిన వారిని ఇబ్బందులు పెడతారు కదా అని కొంతమంది నన్ను ప్రశ్నించారు.
 
నేను అప్పుడు బాధపడలేదు. సంతోషించా. నన్ను పెద్దకాపులుగా గుర్తించిన వారికి ధన్యవాదాలు చెబుతున్నా. అయితే ఇక్కడ కులం గురించి మాట్లాడుతున్నాను. కులపిచ్చి బాగా ఎక్కువగా ఉంది అని గాడిన కట్టేయవద్దండి. అలాంటిది ఏమీ లేదు. నాకు నచ్చింది నేను చెబుతాను. నచ్చిందే చేస్తాను అంటూ మీకు తెలుసుగా అంటూ యాంకర్‌నే తిరిగి ప్రశ్నించారు పోసాని.