శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 11 నవంబరు 2017 (13:14 IST)

భాగమతి సినిమాలో అనుష్కను చూసి తట్టుకోలేరు.. దర్శకుడు

బాహుబలి-2 తరువాత అనుష్క చేస్తున్న చిత్రం భాగమతి. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు. భాగమతి సినిమాలో అనుష్క కొత్త గెటప్‌లో కనిపిస్తుందని సినిమా యూనిట్ ముందు నుంచీ చెబుతూ వస్తోంది. అయితే రీసెంట్‌గా భాగమతికి సంబంధించిన ఫస్ట్

బాహుబలి-2 తరువాత అనుష్క చేస్తున్న చిత్రం భాగమతి. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు. భాగమతి సినిమాలో అనుష్క కొత్త గెటప్‌లో కనిపిస్తుందని సినిమా యూనిట్ ముందు నుంచీ చెబుతూ వస్తోంది. అయితే రీసెంట్‌గా భాగమతికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది. అందులో అనుష్క ఆవేశపడే లుక్‌లో కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా మొత్తం హర్రర్‌గా ప్రేక్షకులు అనుకోవడం ప్రారంభించారు. 
 
అంతేకాదు అనుష్క ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని దర్శకుడు అశోక్ ఖండించారు. భాగమతి సినిమాలో అనుష్క ద్విపాత్రాభినయం చేయడం లేదని, ఇది హర్రర్ సినిమా కూడా కాదని, సినిమా చూసిన తరువాత అనుష్కను మీరు బాగా మెచ్చుకుంటారని, ఆమె కెరీర్ లోనే ఇదొక మంచి సినిమాగా మిగిలిపోతుందని చెప్పాడు దర్శకుడు అశోక్. అయితే ప్రేక్షకుల్లో మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. భాగమతి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.