సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (11:58 IST)

#MondayMotivation : మీరు కూడా మెస్సీలా ఉండండి.. : ఆనంద్ మహీంద్రా

messi
భారతదేశ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ఆనంద్ మహీంద్రా ప్రతి సోమవారం స్ఫూర్తిదాయకమైన సందేశాలను పంచుకుంటుంటారు. అలాగే, సోమవారం కూడా ఓ మంచి సందేశాన్ని పంచుకున్నారు. ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ఫుట్‌బాల్ తుది పోరులో అర్జెంటీనా జట్టును విశ్వవిజేతగా నిలిపిన లియోనిల్ మెస్సి గురించి ఆయన ట్వీట్ చేశారు. 
 
ఈ రోజు మండే మోటివేషన్... "ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌కు రాకుండా ఎలా ఉంటుంది. ఓ వ్యక్తికి అసాధారణ శక్తులు ఉంటే అతడిని మహా పురుషుడు అంటారు. మెస్సి.. తన అంకితభావం, కఠోర శ్రమతో అసాధార విజయాలు సాధించిన సాధారణ వ్యక్తి. మీరు కూడా మెస్సిలా (మహాపురుషుడు)లా ఉండండి" అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. 
 
ఇకపోతే, ఈ సోమవారం గందరగోళంగా మొదలుపెట్టే బదులు దాన్ని మెస్సీ మండే‌గా ఆరంభించండి. అని ఏ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, "సరిగ్గా చెప్పారు" అని కితాబిచ్చారు.