1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 ఫిబ్రవరి 2020 (18:31 IST)

నిర్భయ దోషి చివరి కోరిక కోసం మరో 14 రోజులు, ఆ నలుగుర్నీ త్వరగా ఉరి తీయండి

నిర్భయ దోషులకు విధించిన ఉరి శిక్ష అమలు విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకు సాగుతోంది. దోషులు ఒకరి తర్వాత ఒకరు కోర్టులకు వెళ్తూ, రాష్ట్రపతి క్షమాభిక్ష అంటూ సాగదీస్తున్నారు. ఫిబ్రవరి 1 తెల్లవారు జామున వాళ్లను ఉరి తీస్తారని అంతా అనుకుంటున్న సమయంలో దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. 
 
దీనితో శనివారం ఉరితో గాలిలో కలిసిపోవాల్సిన ఆ నలుగురి ప్రాణాలు జైలు గోడల మధ్య అలాగే వున్నాయి. వినయ్ శర్మ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించారు కానీ జైలు నిబంధనల ప్రకారం ఏ దోషి అయినా ఇలా దరఖాస్తు చేసుకుని అది తిరస్కరణకు గురైతే అతడికి చివరి కోరికను తీర్చుకునేందుకు 14 రోజుల గడవు ఇస్తారట. 
 
అందువల్ల ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి కుదర్లేదు. దీనితో నిర్భయ తల్లిదండ్రులు మరోసారి కోర్టులో నిర్భయ నిందితులను త్వరగా ఉరి తీయాలంటూ పిటీషన్ వేయబోతున్నట్లు సమాచారం. మరి వారి అభ్యర్థన మేరకు నిర్భయ నిందితులను 14 రోజుల లోపుగానే ఉరి తీస్తారా లేదంటే అప్పటి దాకా ఆగుతారా చూడాల్సి వుంది.