Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమాయకుడా.. హఫీజ్‌ను అరెస్ట్ చేయండి..అమెరికా

శనివారం, 25 నవంబరు 2017 (11:50 IST)

Widgets Magazine
Hafiz Saeed

ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను గృహ నిర్భంధం నుంచి విడుదలయ్యాడు. ముంబైలో దాడులకు పాల్పడి 166 మంది ప్రాణాలను బలిగొన్న హఫీజ్‌ను గృహనిర్భంధం నుంచి తప్పించాలని లాహోర్ హైకోర్టులోని రివ్యూ బోర్డు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ సర్కారు హఫీజ్ సయ్యిద్ దోషి అనేందుకు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో హఫీజ్‌ను విడుదల చేయాలని రివ్యూ బోర్డు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో హఫీజ్ విడుదలపై పాకిస్థాన్ తీరును అమెరికా తప్పుబట్టింది. భారత్‌పై యుద్ధం ప్రకటించిన హఫీజ్‌ను తిరిగి అరెస్టు చేయాలని.. అతనిపై కేసు నమోదు చేయాలని పాకిస్థాన్‌కు అమెరికా సూచించింది. కాగా హఫీజ్‌ సయీద్‌ గృహనిర్బంధం నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే భారత్‌పై యుద్ధానికి సై అన్నాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. 
 
అందులో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు. కాశ్మీర్‌కు మద్దతిస్తున్నాననే పది నెలలపాటు తనను గృహ నిర్భంధం చేశారని.. ఇక ఆగేది లేదని కాశ్మీరీల కోసం పోరాటం కొనసాగిస్తానన్నాడు. ఇందుకోసం పాకిస్థాన్ ప్రజలను ఏకం చేసి కాశ్మీరీలు కోరుకునే స్వాతంత్ర్యాన్ని అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని హఫీజ్ సయీద్ తెలిపాడు. 
 
భారత్ తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోందని.. అయినా న్యాయస్థానం నమ్మలేదన్నాడు. ఈ వ్యవహారంలో తాను అమాయకుడినని కోర్టు ధ్రువీకరించిందన్నాడు. ఈ నేపథ్యంలో హఫీజ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా వున్నాయని.. ఈ మేరకు హఫీజ్‌పై కేసు నమోదు చేసి.. అతనిని అరెస్ట్ చేయాలని అమెరికా పాకిస్థాన్‌కు సూచించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రియుడిని పెళ్లాడిందనీ విహహితను గొంతుకోసి చంపేశారు...

తన ప్రియుడిని మరిచిపోలేని ఓ ప్రియురాలు... అతని భార్యను గొంతుకోసి హత్య చేసింది. ఈ దారుణం ...

news

ఇవాంకా కోసం ఇండో - అమెరికా గాజులు

ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌ నగరానికి వచ్చే అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ...

news

ట్రంప్ నా భార్యను గదికి పిలిచి లైంగిక దాడి చేయబోయాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హీరోయిన్లను ...

news

సర్వాంగసుందరంగా ముస్తాబైన లాడ్ బజార్.. ఎందుకు?

హైదరాబాద్ పాతబస్తీలోని లాడ్ బజార్. ఇపుడు ఈ పేరు ప్రతి ఒక్కరినోట్లనూ నానుతోంది. దీనికి ...

Widgets Magazine