Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిరీష - రాజీవ్‌లు కలిసుండటం చూశా.. ఇపుడు అసహ్యం వేస్తోంది : తేజశ్విని

మంగళవారం, 27 జూన్ 2017 (13:27 IST)

Widgets Magazine
tejeswini

బ్యూటీషియన్ శిరీష, రాజీవ్‌లు కలిసుండటాన్ని తాను కళ్లారా చూశానని, కానీ రాజీవ్‌పై ఉన్న పిచ్చిప్రేమ వల్ల వాటిని పెద్దగా పట్టించుకోలేదని ఇపుడు అతన్ని చూస్తే అసహ్యం వేస్తోందని రాజీవ్ ప్రియురాలు తేజశ్విని చెప్పుకొచ్చింది. ఈ మేరకు శిరీష్ ఆత్మహత్య కేసులో ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. 
 
తాను ప్రేమించిన రాజీవ్‌తో శిరీష సన్నిహితంగా ఉండటంతో తాను సంఘర్షణకు లోనయ్యానని చెప్పింది. కేవలం శిరీష వల్లే తనకు, రాజీవ్‌కు మధ్య దూరం పెరుగుతోందనే అనుమానం తనకు కలిగిందని... అది రోజురోజుకూ పెరుగుతూ వచ్చిందని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో రాజీవ్‌కు తెలియకుండా శిరీషతో తాను అనేక సార్లు గొడవపడ్డానని చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి తాను, శిరీష పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నామన్నారు. రాజీవ్‌ను పెళ్లి చేసుకుంటానని అతని తల్లిదండ్రులను కూడా అడిగానని చెప్పింది.  
 
రాజీవ్‌ను తనతో పాటు శిరీష కూడా ఇష్టపడుతోందన్న విషయం తనకు తెలుసునని, అయినప్పటికీ రాజీవ్‌ను తాను పిచ్చిగా ప్రేమించానని తెలిపారు. రాజీవ్‌కు దూరంగా ఉండాలని శిరీష తనను ఎన్నోసార్లు బెదిరించిందని, తనను చెప్పలేని తిట్లు కూడా తిట్టిందని తన వాగ్మూలంలో పేర్కొంది. 
 
రాజీవ్‌ను తానెంతో ఇష్టపడ్డానని, శిరీషతో కలిసుండటం చూసి కోపగించుకున్నానని, ఇప్పుడు అతనిపై అసహ్యం కలుగుతోందని చెప్పింది. రాజీవ్ తనను దారుణంగా మోసం చేశాడని పేర్కొంది. అతని అనుమానాస్పద వైఖరిపై తనకెన్నో అనుమానాలు వచ్చినా, పిచ్చి ప్రేమతో వాటిని పక్కనబెట్టానని వాపోయింది.
 
కాగా, శిరీష కేసులో ఇన్ని రోజులూ తెరపైకి రాని తేజస్విని, ఇప్పుడు బయటకు రావడం గమనార్హం. రాజీవ్, శ్రవణ్‌లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న వేళ, వారు చెప్పిన అంశాలపై నిజాలను నిర్ధారించుకునేందుకు తేజస్వినిని కూడా విచారించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్‌ పాలనతో హ్యాపీగా లేము.. అమెరికన్లకు ఇదో మేలుకొలుపు: అన్సెల్

హాలీవుడ్ నటుడు అన్సెల్ ఎల్టోర్ట్.. అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు ...

news

అమ్మాయిల ముంజేతి పట్టు.. విరిగిన చేయి.. (Video)

ఓ టీవీ చానెల్ నిర్వహించిన ఓ గేమ్ షోలో దరదృష్టకర సంఘటన ఒకటి జరిగింది. పోటీదారులు తమ ...

news

భార్యాభర్తల మధ్య గొడవ: కోపంతో కిరోసిన్ పోసుకున్న భార్య.. నిప్పంటించేసిన భర్త!

భర్తతో గొడవపడిన భార్య ఆవేశంతో ఒంటిపై కిరోసిన్ పోసేసుకుంది.. అదే ఆవేశంతో భర్త కూడా ...

news

శిరీషపై అత్యాచారం జరిగిందా? : డీసీపీ ఏమంటున్నారు?

హైదరాబాద్ బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరిగిందో లేదో తేల్చుతామని హైదరాబాద్ నగర డీసీపీ ...

Widgets Magazine