శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 జులై 2016 (13:38 IST)

ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానంతో చంపేశాడు.. ఆ కసాయిని కోర్టు ఉరితీయమంది!

తన భార్యకు పుట్టిన ముగ్గురు పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానంతో ముగ్గురు కన్నబిడ్డలతో పాటు తన మరదలి కొడుకుని కూడా హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కిరాతకుడిని చంపేయాలని ఉలుబెరియా అడిషనల్ సెషన్స్ జడ్జి సు

తన భార్యకు పుట్టిన ముగ్గురు పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానంతో ముగ్గురు కన్నబిడ్డలతో పాటు తన మరదలి కొడుకుని కూడా హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కిరాతకుడిని చంపేయాలని ఉలుబెరియా అడిషనల్ సెషన్స్ జడ్జి సుభాషిష్ ఘోష్ సంచలన తీర్పునిచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రైష్ ఖురేషీ అనే 40 యేళ్ళ వ్యక్తికి భార్యకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఈ ముగ్గురు పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానం ఆయనలో కలిగింది. దీంతో వారిని హత్య చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో 2011 నవంబర్ 14న కుటుంబ సభ్యులంతా ఓ పెళ్ళి హడావుడిలో ఉండగా ఖురేషీ తన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు కూతుళ్ళు నాలుగేళ్ళ రౌనక్, రెండున్నరేళ్ళ అలిషా, ఆరేళ్ళ కొడుకు షహీద్‌తో పాటు, అతడి మరదలి కొడుకు ఆరేళ్ళ హసన్ పిక్నిక్‌కు తీసుకెళ్లారు. 
 
దామోదర్ నదికి దగ్గరలోని మహిష్రేఖా ప్రాంతంలోకి వెళ్ళిన అనంతరం నలుగురు పిల్లలను నదిలోకి విసిరేసి తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, చనిపోయే ధైర్యం లేకపోవడంతో ఉత్తరప్రదేశ్‌కు పారిపోయాడు. రెండు రోజుల తర్వాత నాలుగు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి. 
 
ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఖురేషీని నవంబర్ 21వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. 2012లో కేసును స్వాధీనం చేసుకున్న సీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ ఉలుబెరియా కోర్టులో విచారణ జరిగింది. నలుగురు చిన్నారులను హత్య చేసినట్లు రుజువుకావడంతో ఉలుబెరియా అడిషనల్ సెషన్స్ జడ్జి సుభాషిష్ ఘోష్ దోషికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.