Widgets Magazine

ఆమె కోసం రోడ్డు మీద కొట్టుకున్న ఇద్దరు 'మొగుళ్లు'... మూడోవాడితో వెళ్లిపోయింది...

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (18:08 IST)

ఇప్పుడు ఇలాంటి ఘటనలు అక్కడక్కడా గోచరిస్తున్నాయి. ఇంతకీ ఏమిటా సంఘటనలు... అంటారా? ఇదిగో ఇదే. బెంగళూరులోని నేలమంగల జాతీయ రహదారిపై 38 ఏళ్ల మహిళ రోడ్డు మీద నిలబడి వుండగా ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ముష్ఠిఘాతాలు ఇచ్చుకుంటున్నారు. కిందాపైనా పడుతూ కుమ్మాయిపోట్లు పొడుచుకుంటున్నారు. అలా వారు కొట్టుకోవడాన్ని చూసిన వాహనచోదకుల్లో కొందరు వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ వారేమాత్రం పట్టించుకోలేదు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆ ఇద్దరు వ్యక్తులు తన భార్యను తీసుకెళ్తున్నాడంటే తన భార్యను తీస్కెళ్తున్నాడంటూ వివరించారు. ఈ క్రమంలో అసలు విషయం ఏంటా అని ఆరా తీసిన పోలీసులు షాక్ తిన్నారు.
couple
 
అదేమిటంటే... శశికళ అనే పేరుగల ఈ 38 ఏళ్ల మహిళకు తొలుత రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఆ ఇద్దరి భర్తలకు విడాకులు ఇచ్చేసింది. తర్వాత మూడోవాడైన మూర్తితో సన్నిహితంగా వుంటూ అతడితో సహజీవనం చేస్తోంది. ఐతే మూర్తికి అంతకుముందే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఇది తెలిసిన శశికళ క్రమంగా అతడికి దూరం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు సిద్దరాజు అనే క్యాబ్ డ్రైవర్ పరిచయమయ్యాడు. 
 
అతడు పెళ్లి చేసుకుంటానంటూ ముందుకు వచ్చాడు. పైగా అతడు ఆమెను పెళ్లాడుతానంటూ ప్రపోజ్ చేశాడు. అతడికి కారు కూడా వుండటంతో ఆమెకు బాగా కలిసి వచ్చింది. జాలీగా అతడి కారులో తిరుగుతూ వుండటంతో ఇది గమనించిన మూర్తి సమయం కోసం వేచి చూశాడు. బస్టాండులో శశికళ-సిద్ధరాజు కనబడటంతో ఒక్కసారిగా సిద్ధరాజుపై దాడికి దిగాడు. ఇద్దర్నీ ఎంత వారించినా కొట్టుకుంటూనే వున్నారు. 
 
ఐతే పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇద్దర్ని అదుపులోకి తీసుకుని శశికళను కూడా విచారించేందుకు ప్రయత్నిస్తే... అసలు వాళ్లిద్దరు తనకు కేవలం స్నేహితులు మాత్రమేనని పోలీసులకు షాకిచ్చింది. అంతేకాదు... తను పెళ్లి చేసుకోబోయేవాడు ఇతడే అంటూ మరో వ్యక్తిని సీన్లోకి తీసుకొచ్చి అతడితో వెళ్లిపోయింది. దీనితో అప్పటిదాకా ఆమె కోసం కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు కూడా నోరెళ్లబెట్టి అలా గుడ్లప్పగించి చూస్తూ వుండిపోయారు. అదీ సంగతి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం... డొక్కా, కాంగ్రెస్ పార్టీతో కలుస్తారా?

అమరావతి : రానున్న ఎన్నికల్లో మెదీని ప్రధాని కాకుండా బిజెపిని ఓడించడమే టిడిపి లక్ష్యమని ...

news

గర్భం నుంచి తలను తీశారు.. మొండెంను వదిలేశారు.. ఎక్కడ?

వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఆపరేషన్ల సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా ...

news

ముగ్గురిని పెళ్లాడాడు.. ముగ్గురూ వెళ్లిపోయారు.. అందుకనీ..

ఆ వ్యక్తిని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురూ ఆయన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ...

news

ఆ హంతకులు చచ్చేంత వరకు జైల్లో ఉండాల్సిందే...

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన ...

Widgets Magazine