వర్శిటీ వాష్‌లో బట్టలూడదీసి విద్యార్థిని వేధించిన అగంతకుడు...

ముంబై విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని వాష్ రూమ్‌లో ఓ విద్యార్థినిని గుర్తు తెలియని అగంతకుడు ఒకడు లైంగికంగా వేధించాడు. వాష్‌ రూమ్‌కు వెళ్ళిన ఆ విద్యార్థినితో దుస్తులు విప్పించి వేధించాడు.

woman
pnr| Last Updated: శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:02 IST)
ముంబై విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని వాష్ రూమ్‌లో ఓ విద్యార్థినిని గుర్తు తెలియని అగంతకుడు ఒకడు లైంగికంగా వేధించాడు. వాష్‌ రూమ్‌కు వెళ్ళిన ఆ విద్యార్థినితో దుస్తులు విప్పించి వేధించాడు. అయితే, ఆ అగంతకుడు ఆ విద్యార్థినిపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. దీనిపై బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు.
 
ముంబై యూనివర్శిటీలోని కలీనా క్యాంపస్ వాష్ రూంలో గుర్తు తెలియని ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. ఈ విషయం తెలియని ఓ విద్యార్థిని వాష్ రూమ్‌లోకి వెళ్లింది. ఆ వెంటనే తలపు వేసిన అగంతకుడు ఆమెను వేధించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. 
 
పట్టపగలే యూనివర్శిటీ ఆవరణలోని వాష్ రూంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. 150 ఏళ్ల యూనివర్శిటీలో విద్యార్థినులకు రక్షణ కొరవడిందని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించ లేక పోయామని వర్శిటీ రిజిస్ట్రార్ దినేష్ కాంబ్లే చెప్పారు. నిందితుడిని గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. దీనిపై రిజిస్ట్రార్ విచారణకు ఆదేశించారు. దీనిపై మరింత చదవండి :