సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంతో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నాడు తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. శ్రీరాములపల్లికి చెందిన వివేకానందరెడ్డి (16) గొల్లపల్లి ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున

Mohan| Last Modified గురువారం, 9 ఆగస్టు 2018 (18:18 IST)
సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంతో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం నాడు తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. శ్రీరాములపల్లికి చెందిన వివేకానందరెడ్డి (16) గొల్లపల్లి ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గతంతో వివేక్ తండ్రి ఏలేటి తిరుపతిరెడ్డి అతనికి సెల్‌ఫోన్ కొనిచ్చాడు. 
 
ఇటీవల తిరుపతి వెళ్లినప్పుడు వివేక్ సెల్‌ ఫోన్ పోయింది. దీంతో మళ్లీ కొత్త ఫోన్ కొనివ్వాలని మారాం చేస్తూ వచ్చాడు. అయితే ఇటీవలే ఇంటి నిర్మాణం, ద్విచక్రవాహనం కొనుగోలు చేయడం వల్ల ఖర్చులు పెరిగాయని, అందువల్ల తర్వాత కొనిస్తానని తండ్రి నచ్చజెప్పినప్పటికీ మనస్తాపం చెందిన వివేక్ మంగళవారం రాత్రి ఇంటిలో వారందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీనిపై మరింత చదవండి :