సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 10 ఆగస్టు 2018 (14:55 IST)

చంద్రబాబు ఒక్క రోజు హోటల్ ఖర్చు 8.7 లక్షలా? కర్నాటక సీఎం షాక్...

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు షాకిచ్చారంటూ ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. వివరాలను చూస్తే... కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా మే 23న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే నేతల కోసం బెంగళూరులో

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు షాకిచ్చారంటూ ఓ జాతీయ  పత్రిక కథనం ప్రచురించింది. వివరాలను చూస్తే... కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా మే 23న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే నేతల కోసం బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌తో పాటు మరో స్టార్ హోటల్‌ను బుక్ చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలు, జాతీయ నేతలు హాజరయ్యారు. 
 
అతిథుల బసకు అయ్యే ఖర్చు మొత్తం కర్ణాటక ప్రభుత్వమే భరించింది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు కూడా హాజరయ్యారు. మే 23న బెంగళూరు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి మరునాడు మే 24 న హోటల్ ఖాళీ చేశారు. ఇందుకు అయిన ఖర్చు అక్షరాలా 8.7 లక్షల రూపాయలట. కుమరస్వామి ప్రమాణస్వీకారానికి ఎంత ఖర్చయిందో తెలపాలని ఆర్టీఏ కార్యకర్త ఆర్జీ పెట్టుకుంటే తెలిసిన వివరాలివి. 
 
అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 1.02 లక్షలు, మాయావతి 1.41 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 1.02 లక్షలు, శరద్ పవార్ 64 వేలు, కమల్ హాసన్‌కు 1.02 లక్షలు ఖర్చయిందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో చంద్రబాబునాయుడు బిల్లు మాత్రం అదిరిపోయింది. ఈ విషయాన్ని ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అతిథి మర్యాదలకే 42 లక్షలు ఖర్చు కావడం పట్ల విస్తుపోతున్నారు. అందరికంటే చంద్రబాబు నాయుడు ఖర్చే తడిసి మోపెడయ్యిందట కుమారస్వామికి.