రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ఎంపికయ్యారు. భజన్ లాల్ పేరును ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ మహిళా నేత వసుంధరా రాజే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆయన ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది.
ఈ మూడు రాష్ట్రాలకు బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విష్ణు ఆనంద్ సాయి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ల పేరును ఎంపిక చేయగా, ఇపుడు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మను మంగళవారం ఎంపిక చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో దియా సింగ్, డాక్టర్ ప్రేమ చంద్ బైర్వాలను ఉప ముఖ్యమంత్రులగా నియమించింది. వాసుదేవ్ దేవ్ నానిని స్వీకర్‌గా వ్యవహరిస్తారని బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది.